Ichchagamu nerabide nemaayane

ఇచ్చకము నెరపితే నేమాయనే
Language

(॥పల్లవి॥)
ఇచ్చకము నెరపితే నేమాయనే
పచ్చిమాట లాడితేనే పదర నేమిటికే

(॥॥)
కుచ్చలపై వొడ్డాణము కొనచూపులఁ జూచితే
కొచ్చి కొచ్చి యేమిటికి గొణఁగేవే
ముచ్చట నీకంకణము ముట్టి చూచినంతలోనే
రిచ్చల నింతటిలోనే రేఁగనేఁటికే

(॥॥)
కొప్పుపై మొగలిరేకు కూడఁగఁ జెరిగితేను
తప్పులేల యెంచేవే తమకించి
చిప్పిలఁ బయ్యదకొంగు చేరి చక్కఁ బెట్టితేను
వుప్పతించి యెంతేసి వొట్లువెట్టేవే

(॥॥)
అమమేల్‌మంగవు నిన్ను నక్కునఁ బెట్టుకొంటేను
నలువంక నీవేమి నవ్వు నవ్వేవే
యెలమిని శ్రీ వేంకటేశుఁడనేఁ బొగడితే
మెలుపున నెంతేసిమెచ్చు మెచ్చేవే

(||pallavi||)
ichchagamu nĕrabide nemāyane
pachchimāḍa lāḍidene padara nemiḍige

(||||)
kuchchalabai vŏḍḍāṇamu kŏnasūbulam̐ jūside
kŏchchi kŏchchi yemiḍigi gŏṇam̐geve
muchchaḍa nīgaṁkaṇamu muṭṭi sūsinaṁtalone
richchala niṁtaḍilone rem̐ganem̐ṭige

(||||)
kŏppubai mŏgaliregu kūḍam̐gam̐ jĕrigidenu
tappulela yĕṁcheve tamagiṁchi
sippilam̐ bayyadagŏṁgu seri sakkam̐ bĕṭṭidenu
vuppadiṁchi yĕṁtesi vŏṭluvĕṭṭeve

(||||)
amamel‌maṁgavu ninnu nakkunam̐ bĕṭṭugŏṁṭenu
naluvaṁka nīvemi navvu navveve
yĕlamini śhrī veṁkaḍeśhum̐ḍanem̐ bŏgaḍide
mĕlubuna nĕṁtesimĕchchu mĕchcheve