Ichchagamu nera deege nemi seyavachchu nimka

ఇచ్చకము నేర దీకె నేమి సేయవచ్చు నిఁక
Language

(॥పల్లవి॥)
ఇచ్చకము నేర దీకె నేమి సేయవచ్చు నిఁక
మచ్చిక దలఁచి నీవు మన్నించు సతిని

(॥ఇచ్చ॥)
చెంతల నేమి సేసినా చెలుల దూరుట గాక
పంతము లాడుదురా పతితోను
వింతదానితో నవ్వితే వెంగెము లాడుట గాక
అంతలోనే ముంగురులు అంటఁ దరమౌనా

(॥ఇచ్చ॥)
నగుతాఁ జెనకితేను ననిచి వోర్చుట గాక
పగలు చాటుదురా పతితోను
చిగురుమోవిగంటి సేసితే మెచ్చుటగాక
తగవులఁ బెట్టి నీపైఁ దప్పుమోపవచ్చునా

(॥ఇచ్చ॥)
ఆదనఁ జన్నులంటితే నాస చెల్లింతురు గాక
పదరి పెనఁగుదురా పతితోను
యిదివొ శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
పదిమారులు నిన్నుఁ బంగించఁ దగునా

(||pallavi||)
ichchagamu nera dīgĕ nemi seyavachchu nim̐ka
machchiga dalam̐si nīvu manniṁchu sadini

(||ichcha||)
sĕṁtala nemi sesinā sĕlula dūruḍa gāga
paṁtamu lāḍudurā padidonu
viṁtadānido navvide vĕṁgĕmu lāḍuḍa gāga
aṁtalone muṁgurulu aṁṭam̐ daramaunā

(||ichcha||)
nagudām̐ jĕnagidenu nanisi vorsuḍa gāga
pagalu sāḍudurā padidonu
sigurumovigaṁṭi seside mĕchchuḍagāga
tagavulam̐ bĕṭṭi nībaim̐ dappumobavachchunā

(||ichcha||)
ādanam̐ jannulaṁṭide nāsa sĕlliṁturu gāga
padari pĕnam̐gudurā padidonu
yidivŏ śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
padimārulu ninnum̐ baṁgiṁcham̐ dagunā