ఇచ్చకమే సేయవలె ఇన్నిటికి లోఁగావలె
(॥పల్లవి॥)
ఇచ్చకమే సేయవలె ఇన్నిటికి లోఁగావలె
తచ్చి ఇదె నీతి సుమ్మీ దంపతులకెల్లాను
(॥ఇచ్చ॥)
తగవులఁ బెట్టరాదు తమకించి యాడరాదు
మొగము చూచి చూచి మగవానిని
అగడు సేయఁగరాదు అలముటఁబెట్టరాదు
నగి నగియైనాను నాథుడైనవానిని
(॥ఇచ్చ॥)
ఆరజము సేయరాదు అలుకలే పెంచరాదు
నేరములే పైవేసి నిండు దొరను
గోర గీరఁగరాదు కోపము సేయఁగరాదు
కోరి వినోదానకైనా గుణియైనవానిని
(॥ఇచ్చ॥)
వేసరుకొనఁగరాదు వింతగాఁ జూడఁగరాదు
ఆసుద్దులకు శ్రీవేంకటాద్రీశుని
సేసతోఁ గూడితివి మించి యలమేల్మంగవు
బాసిచ్చి నిన్నేలిన యీపాయరాని వానిని
(||pallavi||)
ichchagame seyavalĕ inniḍigi lom̐gāvalĕ
tachchi idĕ nīdi summī daṁpadulagĕllānu
(||ichcha||)
tagavulam̐ bĕṭṭarādu tamagiṁchi yāḍarādu
mŏgamu sūsi sūsi magavānini
agaḍu seyam̐garādu alamuḍam̐bĕṭṭarādu
nagi nagiyainānu nāthuḍainavānini
(||ichcha||)
ārajamu seyarādu alugale pĕṁcharādu
neramule paivesi niṁḍu dŏranu
gora gīram̐garādu kobamu seyam̐garādu
kori vinodānagainā guṇiyainavānini
(||ichcha||)
vesarugŏnam̐garādu viṁtagām̐ jūḍam̐garādu
āsuddulagu śhrīveṁkaḍādrīśhuni
sesadom̐ gūḍidivi miṁchi yalamelmaṁgavu
bāsichchi ninnelina yībāyarāni vānini