ఇచ్చకమే సేయవద్దా యింతులకుఁ బతితోను
(॥పల్లవి॥)
ఇచ్చకమే సేయవద్దా యింతులకుఁ బతితోను
కుచ్చి యీతని నేపొద్దూఁ గొనియాడఁ గదవే
(॥ఇచ్చ॥)
వాసులకే పెనఁగేవు వంతులకే జునిఁగేవు
సేసవెట్టిన విభుఁడు చెనకఁగాను
ఆసలెల్లా రేఁచేవు అట్టె చన్నులు దాఁచేవు
బాసదప్ప కీతఁడు నీపై బత్తి చూపఁగాను
(॥ఇచ్చ॥)
కప్పురాన వేసేవు కాయమున రాసేవు
చిప్పిల నాతఁడు వీచేయి వట్టఁగా
చొప్పులెత్తి నవ్వేవు సొలసి కొప్పు దువ్వేవు
తప్ప కీతఁడు రతికిఁ దమకించఁగాను
(॥ఇచ్చ॥)
చేతులెత్తి మొక్కేవు సిగ్గున మాఁట గుక్కేవు
కాతరాన దానే నిన్నుఁ గాఁగిలించఁగా
యీతల శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను నేలినాఁడు
ఘాతల వేఁడుకోనేలే యీతఁడు మన్నించఁగాను
(||pallavi||)
ichchagame seyavaddā yiṁtulagum̐ badidonu
kuchchi yīdani nebŏddūm̐ gŏniyāḍam̐ gadave
(||ichcha||)
vāsulage pĕnam̐gevu vaṁtulage junim̐gevu
sesavĕṭṭina vibhum̐ḍu sĕnagam̐gānu
āsalĕllā rem̐sevu aṭṭĕ sannulu dām̐sevu
bāsadappa kīdam̐ḍu nībai batti sūbam̐gānu
(||ichcha||)
kappurāna vesevu kāyamuna rāsevu
sippila nādam̐ḍu vīseyi vaṭṭam̐gā
sŏppulĕtti navvevu sŏlasi kŏppu duvvevu
tappa kīdam̐ḍu radigim̐ damagiṁcham̐gānu
(||ichcha||)
sedulĕtti mŏkkevu sigguna mām̐ṭa gukkevu
kādarāna dāne ninnum̐ gām̐giliṁcham̐gā
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu nelinām̐ḍu
ghādala vem̐ḍugonele yīdam̐ḍu manniṁcham̐gānu