Ichchagamaadide meegu nemi dosamaaya nemdu

ఇచ్చకమాడితే మీకు నేమి దోసమాయ నేఁడు
Language

(॥పల్లవి॥)
ఇచ్చకమాడితే మీకు నేమి దోసమాయ నేఁడు
అచ్చమైన మీకు మాతో నంత చలమేలే

(॥॥)
చెప్పకురే చెలులార చెలువుని మానుమని
అప్పుడే వీనులకు వెట్టయి తోఁచీని
తిప్పకురే నామనసు తెమ్మలుగా వలచితి
నెప్పున నేఁ బాయ వట్టినిష్టూరమేలే

(॥॥)
తీయకురే చేయివట్టి తెగి వానింటికిఁబోఁగా
కాయమెల్ల నిందువంకఁ గాఁకరేఁగీని
పాయ మాతని కిచ్చితి పంతానకు దక్కితిని
యీయెడ వట్టికయ్యానకేల పెనఁగేరే

(॥॥)
వుప్పతించకురే వానివద్ద నేఁ గూచుండఁగాను
రెప్పలఁ గోపము మీపై రేసులెక్కీని
వొప్పుగ శ్రీవేంకటేశుఁ డూరడించి నన్నుఁ గూడె
కప్పుర మియ్యరే మీలోఁ గడమ లింకేలే

(||pallavi||)
ichchagamāḍide mīgu nemi dosamāya nem̐ḍu
achchamaina mīgu mādo naṁta salamele

(||||)
sĕppagure sĕlulāra sĕluvuni mānumani
appuḍe vīnulagu vĕṭṭayi tom̐sīni
tippagure nāmanasu tĕmmalugā valasidi
nĕppuna nem̐ bāya vaṭṭiniṣhṭūramele

(||||)
tīyagure seyivaṭṭi tĕgi vāniṁṭigim̐bom̐gā
kāyamĕlla niṁduvaṁkam̐ gām̐karem̐gīni
pāya mādani kichchidi paṁtānagu dakkidini
yīyĕḍa vaṭṭigayyānagela pĕnam̐gere

(||||)
vuppadiṁchagure vānivadda nem̐ gūsuṁḍam̐gānu
rĕppalam̐ gobamu mībai resulĕkkīni
vŏppuga śhrīveṁkaḍeśhum̐ ḍūraḍiṁchi nannum̐ gūḍĕ
kappura miyyare mīlom̐ gaḍama liṁkele