Ichchagabu maadala yillaala nenu

ఇచ్చకపు మాటల యిల్లాల నేను
Language

(॥పల్లవి॥)
ఇచ్చకపు మాటల యిల్లాల నేను
దిచ్చరి మాటలు నేర తెలుసుకో నీవే

(॥ఇచ్చ॥)
యిమ్ములఁ జేసేపనులెల్లాఁ జేసివచ్చి నాతో
సమ్మతించఁ జెప్పితివి చాలదా యిది
అమ్మరో యింకా నిన్ను నౌఁగాదనేదేమి
దిమ్ము రేఁగె వలపులు తెలుసుకో నీవె

(॥ఇచ్చ॥)
చల్లఁగా నానావిధాన చవులెల్లాఁ జూచి వచ్చి
చెల్లబెట్టెవు సుద్దులు చింత యేటికే
వెల్లవిరి నింద నీపైవేయఁగా వచ్చేదేమి
తెల్లమాయఁ బనులెల్లా తెలుసుకో నీవే

(॥ఇచ్చ॥)
బూమెల్లాఁ దిరుగులాడి పొందులెల్లా నేర్చి వచ్చి
కామించి నన్నేలితివి కడమ లేవి
గోమున శ్రీవేంకటేశ కొసరఁగా నిఁకనేమి
దీమసాన నే నవ్వితి తెలుసుకో నీవే

(||pallavi||)
ichchagabu māḍala yillāla nenu
dichchari māḍalu nera tĕlusugo nīve

(||ichcha||)
yimmulam̐ jesebanulĕllām̐ jesivachchi nādo
sammadiṁcham̐ jĕppidivi sāladā yidi
ammaro yiṁkā ninnu naum̐gādanedemi
dimmu rem̐gĕ valabulu tĕlusugo nīvĕ

(||ichcha||)
sallam̐gā nānāvidhāna savulĕllām̐ jūsi vachchi
sĕllabĕṭṭĕvu suddulu siṁta yeḍige
vĕllaviri niṁda nībaiveyam̐gā vachchedemi
tĕllamāyam̐ banulĕllā tĕlusugo nīve

(||ichcha||)
būmĕllām̐ dirugulāḍi pŏṁdulĕllā nersi vachchi
kāmiṁchi nannelidivi kaḍama levi
gomuna śhrīveṁkaḍeśha kŏsaram̐gā nim̐kanemi
dīmasāna ne navvidi tĕlusugo nīve