ఇచ్చక మెఱఁగవద్దా యేమే పతి లాలించఁగా
(॥పల్లవి॥)
ఇచ్చక మెఱఁగవద్దా యేమే పతి లాలించఁగా
రచ్చ వేసేవు వలపు రాఁపులివి యేలే
(॥ఇచ్చ॥)
సరుస నాతఁడు నీమై జవ్వాది వూయ రాఁగా
సరి వెనఁగేవు యింత చలములేలే
పరగి జారిని నీ పయ్యద చక్కఁ గప్పఁగా
కరము బిగ్గెఁ బట్టేవు కక్కస మింతేలే
(॥ఇచ్చ॥)
మన్నించి యాతఁడు నీతో మంచి మాఁట లాడఁగాను
సన్నల జంకించేవు యీసణఁగులేలే
మిన్నక కొసరి తనమీఁద నానవెట్టఁగాను
పన్ని నోరుమూసేవు పంతా లింత యేలే
(॥ఇచ్చ॥)
మొక్కలాన నాతఁడు నీమోవితేనె లానఁగాను
వుక్కు గోర నూఁదే వింత వుద్దండాలేలే
చెక్కు నొక్కి నిన్ను నిట్టె శ్రీవేంకటేశుఁ డేలఁగా
మొక్కుచు వీఁగేవు వట్టి మొఱఁగు విఁకేలే
(||pallavi||)
ichchaga mĕṟam̐gavaddā yeme padi lāliṁcham̐gā
rachcha vesevu valabu rām̐pulivi yele
(||ichcha||)
sarusa nādam̐ḍu nīmai javvādi vūya rām̐gā
sari vĕnam̐gevu yiṁta salamulele
paragi jārini nī payyada sakkam̐ gappam̐gā
karamu biggĕm̐ baṭṭevu kakkasa miṁtele
(||ichcha||)
manniṁchi yādam̐ḍu nīdo maṁchi mām̐ṭa lāḍam̐gānu
sannala jaṁkiṁchevu yīsaṇam̐gulele
minnaga kŏsari tanamīm̐da nānavĕṭṭam̐gānu
panni norumūsevu paṁtā liṁta yele
(||ichcha||)
mŏkkalāna nādam̐ḍu nīmovidenĕ lānam̐gānu
vukku gora nūm̐de viṁta vuddaṁḍālele
sĕkku nŏkki ninnu niṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelam̐gā
mŏkkusu vīm̐gevu vaṭṭi mŏṟam̐gu vim̐kele