ఇచ్చక మెఱఁగవద్దా ఇంతవాఁడవు
(॥పల్లవి॥)
ఇచ్చక మెఱఁగవద్దా ఇంతవాఁడవు
కచ్చు పెట్టుకున్న దానిఁ గాకు సేతురా
(॥॥)
చెలియను నవ్వించఁగా చిరుచెమటలు గారీ
అలయింతురా నీవు ఆఁటదానిని
సెలవులనవ్వులతో సిగ్గులు వడియఁ గాను
బలిమి నాపెచన్నులు పట్టవచ్చునా
(॥॥)
అట్టె మాటలాడించఁ గా నదరము వసివాడీ
పెట్టుదురా గాసి నింత ప్రియురాలిని
చుట్టరికములెల్లాను చూపులనే తెలుపఁగా
గుట్టులేక కొప్పువీడఁ గొంగువట్టితీతురా
(॥॥)
సారెఁ గాఁగిటఁ గూడఁగా జడిసీ మైఁబులకలు
మేరమీరుదురా యలమేలుమంగను
యీరీతి శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గూడఁగాను
పేరెడిసరసములఁ బెనఁగ సంగతులా
(||pallavi||)
ichchaga mĕṟam̐gavaddā iṁtavām̐ḍavu
kachchu pĕṭṭugunna dānim̐ gāgu sedurā
(||||)
sĕliyanu navviṁcham̐gā sirusĕmaḍalu gārī
alayiṁturā nīvu ām̐ṭadānini
sĕlavulanavvulado siggulu vaḍiyam̐ gānu
balimi nābĕsannulu paṭṭavachchunā
(||||)
aṭṭĕ māḍalāḍiṁcham̐ gā nadaramu vasivāḍī
pĕṭṭudurā gāsi niṁta priyurālini
suṭṭarigamulĕllānu sūbulane tĕlubam̐gā
guṭṭulega kŏppuvīḍam̐ gŏṁguvaṭṭidīdurā
(||||)
sārĕm̐ gām̐giḍam̐ gūḍam̐gā jaḍisī maim̐bulagalu
meramīrudurā yalamelumaṁganu
yīrīdi śhrī veṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍam̐gānu
perĕḍisarasamulam̐ bĕnam̐ga saṁgadulā