ఇపు డిన్నిటికి సైరించవలెఁగా
(॥పల్లవి॥)
ఇపు డిన్నిటికి సైరించవలెఁగా
కపటా లిన్నియు మీఁదఁ గనుకొనేఁగాని
(॥ఇపు॥)
యేడ లేని మచ్చికల కింత చిక్కినవేళ
నాడ(డి?) నెట్టెల్లానే నాడవలెఁగా
వేడుకైతేఁ జాలుఁగాక విసుగనేఁటికి నే
సూడునట్టియ యప్పుడైనాఁ జూచుకొనేఁగాని
(॥ఇపు॥)
పంతపునాకోరికెలబారికిఁ జిక్కినవేళ
వింతలు నీవేమనిన వినవలెఁగా
మంతనాన నాతోడ మాటలకుఁ బనిలేదు
అంతయు నీరతివేళ నాడుకొనేఁగాని
(॥ఇపు॥)
చిత్తము నీకొప్పగించి చేతికిలోనైన వేళ
కొత్త నీచెఁ(చేఁ?) తల కియ్యకొనవలెఁగా
పొత్తులశ్రీవేంకటేశ పొందితివి చాలు నీ
తత్తరపులచ్చనల దాఁచుకొనేఁగాని
(||pallavi||)
ibu ḍinniḍigi sairiṁchavalĕm̐gā
kabaḍā linniyu mīm̐dam̐ ganugŏnem̐gāni
(||ibu||)
yeḍa leni machchigala kiṁta sikkinaveḽa
nāḍa(ḍi?) nĕṭṭĕllāne nāḍavalĕm̐gā
veḍugaidem̐ jālum̐gāga visuganem̐ṭigi ne
sūḍunaṭṭiya yappuḍainām̐ jūsugŏnem̐gāni
(||ibu||)
paṁtabunāgorigĕlabārigim̐ jikkinaveḽa
viṁtalu nīvemanina vinavalĕm̐gā
maṁtanāna nādoḍa māḍalagum̐ baniledu
aṁtayu nīradiveḽa nāḍugŏnem̐gāni
(||ibu||)
sittamu nīgŏppagiṁchi sedigilonaina veḽa
kŏtta nīsĕm̐(sem̐?) tala kiyyagŏnavalĕm̐gā
pŏttulaśhrīveṁkaḍeśha pŏṁdidivi sālu nī
tattarabulachchanala dām̐sugŏnem̐gāni