Hatti neege dakkenade aadamdu nemdu

హత్తి నీకె దక్కెనటె ఆతఁడు నేఁడు
Language

(॥పల్లవి॥)
హత్తి నీకె దక్కెనటె ఆతఁడు నేఁడు
పొత్తుల మొగఁ డాతఁడు పొలఁతులకు

(॥త్తి॥)
మంతనాన నేమని మాటలాడేవే
కాంతునిమనసు నీవు కంటివటవే
పంతాలతో నీవేల బయలీఁదేవే
బంతివలపులవారు పదివేలు గలరే

(॥త్తి॥)
నాటుకొన సారెనేల నవ్వు నవ్వేనే
జూటరి యాతఁడు నీకు సులభుఁడటే
మేటివై నీవెంత యేమ్మెలు సేసేవే
కూటమిసతు లెంచితే కొట్లున్నారే

(॥త్తి॥)
పలుమారు నీవేల గుబ్బల నొత్తేవే
బలిమి శ్రీవేంకటేశుఁ బైకొనేవటే
అలమేలుమంగపతి యతఁడు నన్నేలినాఁడు
యిలనింకొ మనబోఁటు లెందరైనాఁ గలరు

(||pallavi||)
hatti nīgĕ dakkĕnaḍĕ ādam̐ḍu nem̐ḍu
pŏttula mŏgam̐ ḍādam̐ḍu pŏlam̐tulagu

(||tti||)
maṁtanāna nemani māḍalāḍeve
kāṁtunimanasu nīvu kaṁṭivaḍave
paṁtālado nīvela bayalīm̐deve
baṁtivalabulavāru padivelu galare

(||tti||)
nāḍugŏna sārĕnela navvu navvene
jūḍari yādam̐ḍu nīgu sulabhum̐ḍaḍe
meḍivai nīvĕṁta yemmĕlu seseve
kūḍamisadu lĕṁchide kŏṭlunnāre

(||tti||)
palumāru nīvela gubbala nŏtteve
balimi śhrīveṁkaḍeśhum̐ baigŏnevaḍe
alamelumaṁgabadi yadam̐ḍu nannelinām̐ḍu
yilaniṁkŏ manabom̐ṭu lĕṁdarainām̐ galaru