హరియు సిరియు నేఁగే రదివో తేరు
(॥పల్లవి॥)
హరియు సిరియు నేఁగే రదివో తేరు
పరంజ్యోతి స్వరూపపు పైఁడికుండ తేరు
(॥హరి॥)
గరుడధ్వజపుఁ దేరు కనకమయపుఁ దేరు
సురలు బొమ్మలైనారు చుట్లఁ దేరు
మెరుఁగుల మేఘముల మించుఁ గొఱిఁగెల తేరు
సిరుల ధ్రువలోకపు శిఖరపుఁ దేరు
(॥హరి॥)
బలుకుల పర్వతాలె బండికండ్లైన తేరు
నలుదిక్కు లంచుల వున్నతపుఁ దేరు
కొలదిఁలేని చుక్కలకుచ్చుల ముత్తేల తేరు
మెలుపు నాకాశగంగ మేలుకట్ల తేరు
(॥హరి॥)
మునులనే వుత్తమాశ్వములఁగాఁ గట్టిన తేరు
ఘనమహిమలనే సింగారపుఁ దేరు
యెనసి శ్రీవేంకటేశుఁ డెపుఁడూ నలమేల్మంగ
దినదినభోగములఁ దిరమైన తేరు
(||pallavi||)
hariyu siriyu nem̐ge radivo teru
paraṁjyodi svarūbabu paim̐ḍiguṁḍa teru
(||hari||)
garuḍadhvajabum̐ deru kanagamayabum̐ deru
suralu bŏmmalaināru suṭlam̐ deru
mĕrum̐gula meghamula miṁchum̐ gŏṟim̐gĕla teru
sirula dhruvalogabu śhikharabum̐ deru
(||hari||)
balugula parvadālĕ baṁḍigaṁḍlaina teru
naludikku laṁchula vunnadabum̐ deru
kŏladim̐leni sukkalaguchchula muttela teru
mĕlubu nāgāśhagaṁga melugaṭla teru
(||hari||)
munulane vuttamāśhvamulam̐gām̐ gaṭṭina teru
ghanamahimalane siṁgārabum̐ deru
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍĕbum̐ḍū nalamelmaṁga
dinadinabhogamulam̐ diramaina teru