Hariyavadaarame aadam didamdu

హరియవతారమె ఆతఁ డితఁడు
Language

(॥పల్లవి॥)
హరియవతారమె ఆతఁ డితఁడు
పరమసంకీర్తనఫలములో నిలిపె

(॥హరి॥)
వున్నాఁడు వైకుంఠమున నున్నాఁడు యాచార్యునొద్ద
వున్నతోన్నతమహిమ నన్నమయ్య
వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు
పన్నిన నారదాదులు పైపైఁ బాడఁగను

(॥హరి॥)
చరియించు నొకవేళ సనకాదిమునులలో
హరిఁ బాడుఁ దాళ్ళపాకఅన్నమయ్య
తిరమై యాళువారల తేజము దానైయుండు
గరుడానంతముఖ్య ఘనులంగడిని

(॥హరి॥)
శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతికొలువునందు
ఆవహించెఁ దాళ్ళపాకఅన్నమయ్య
దేవతలు మునులును దేవుఁడని జయవెట్టఁ
గోవిదుఁడై తిరిగాడీఁ గోనేటిదండను

(||pallavi||)
hariyavadāramĕ ādam̐ ḍidam̐ḍu
paramasaṁkīrdanaphalamulo nilibĕ

(||hari||)
vunnām̐ḍu vaiguṁṭhamuna nunnām̐ḍu yāsāryunŏdda
vunnadonnadamahima nannamayya
vunnavi saṁkīrdanālu vŏṭṭuga logamulaṁdu
pannina nāradādulu paibaim̐ bāḍam̐ganu

(||hari||)
sariyiṁchu nŏgaveḽa sanagādimunulalo
harim̐ bāḍum̐ dāḽḽabāgaannamayya
tiramai yāḽuvārala tejamu dānaiyuṁḍu
garuḍānaṁtamukhya ghanulaṁgaḍini

(||hari||)
śhrīveṁkaḍādrimīm̐da śhrībadigŏluvunaṁdu
āvahiṁchĕm̐ dāḽḽabāgaannamayya
devadalu munulunu devum̐ḍani jayavĕṭṭam̐
govidum̐ḍai tirigāḍīm̐ goneḍidaṁḍanu