Harisharanaagadi yamdula kaushadha

హరిశరణాగతి యందుల కౌషధ
Language

(॥పల్లవి॥)
హరిశరణాగతి యందుల కౌషధ-
మిరవుగ నెఱిఁగిన నెక్కదు విషము

(॥హరి॥)
చంచున నొడిసేటి సర్పము వంటిది
కంచములో తన కర్మము
అంచే జననమరణాదులే కోరలు
పంచల నాడును పట్టఁగరాదు

(॥హరి॥)
బలుసంసారము పడిగె దీనికిని
పొలసి దేహ మనుపుట్టఁ బడి
నలి నహూరాత్రపు నాలికలు గోరలు
బలిమి నూరకే పట్టఁగరాదు

(॥హరి॥)
మహి సుఖదుఃఖములు మలకలు
సహజపుఁ బొరలే సంపదలు
యిహమున శ్రీవేంకటేశుఁ డాడించీ
బహుగతి నేమిటఁ బట్టఁగరాదు

(||pallavi||)
hariśharaṇāgadi yaṁdula kauṣhadha-
miravuga nĕṟim̐gina nĕkkadu viṣhamu

(||hari||)
saṁchuna nŏḍiseḍi sarbamu vaṁṭidi
kaṁchamulo tana karmamu
aṁche jananamaraṇādule koralu
paṁchala nāḍunu paṭṭam̐garādu

(||hari||)
balusaṁsāramu paḍigĕ dīnigini
pŏlasi deha manubuṭṭam̐ baḍi
nali nahūrātrabu nāligalu goralu
balimi nūrage paṭṭam̐garādu

(||hari||)
mahi sukhaduḥkhamulu malagalu
sahajabum̐ bŏrale saṁpadalu
yihamuna śhrīveṁkaḍeśhum̐ ḍāḍiṁchī
bahugadi nemiḍam̐ baṭṭam̐garādu