హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుఁడు గాఁడు
(॥పల్లవి॥)
హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుఁడు గాఁడు
వెరవుగా సోదించి వినుకొండో
(॥హరి॥)
ఆరసి చక్రాంకిత మనిన మాట
ద్వారకలో కృష్ణు డన్న ధర్మము గాదా
భారతములో నున్నదే పంచమవేద మిది
సూరలుగా సోదించి చూచుకొండో
(॥హరి॥)
తేటగా భుజచక్రద్విజాతి నవని
తాటించి వై ఘానసులు ధరించే ధర్మమిది
నూటొక్క ఋషులిడిన నూటొక్క సంతలందు
ఘాటముగా సోదించి కనుకొండో
(॥హరి॥)
యెంచఁ దాపపుడ్రనామహిత మంత్ర యాగమని
పంచసంస్కారము చెప్పే పాంచరాత్ర ధర్మ మిది
అంచల శ్రీ వేంకటేశు ఆనతి నయిదు లక్షలు
సంచితమైన శాస్త్రము చదువు కొండో
(||pallavi||)
harimudra dhariṁchaga arsiṁcham̐ bātrum̐ḍu gām̐ḍu
vĕravugā sodiṁchi vinugŏṁḍo
(||hari||)
ārasi sakrāṁkida manina māḍa
dvāragalo kṛṣhṇu ḍanna dharmamu gādā
bhāradamulo nunnade paṁchamaveda midi
sūralugā sodiṁchi sūsugŏṁḍo
(||hari||)
teḍagā bhujasakradvijādi navani
tāḍiṁchi vai ghānasulu dhariṁche dharmamidi
nūḍŏkka ṛṣhuliḍina nūḍŏkka saṁtalaṁdu
ghāḍamugā sodiṁchi kanugŏṁḍo
(||hari||)
yĕṁcham̐ dābabuḍranāmahida maṁtra yāgamani
paṁchasaṁskāramu sĕppe pāṁcharātra dharma midi
aṁchala śhrī veṁkaḍeśhu ānadi nayidu lakṣhalu
saṁchidamaina śhāstramu saduvu kŏṁḍo