Harim goluvani phala nunubhavimchuda gaaga

హరిఁ గొలువని ఫల నునుభవించుట గాక
Language

(॥పల్లవి॥)
హరిఁ గొలువని ఫల నునుభవించుట గాక
యిరుసందిఁ బడ్డ దేహి కేఁటి సుఖమయ్య

(॥హరి॥)
తూడరి మోచినమోపు తొమ్మిదిగంతులమేను
కడుసందిఁ గట్టినది కర్మపుఁదాడు
శడిఁ బంచేద్రియములపై తరవులుఁ బెట్టు
యెడపు సంసారికే నేఁటి సుఖమయ్యా

(॥హరి॥)
వేచి లేచి సేసెది విషయములకు వెట్టి
పేగులలో తీఁట రతిపెరరేఁపులూ
ఆగడుపుఁ దనలోనిఁ యాకలి ఆరని చిచ్చు
యీగతి నుండేదేహి కేఁటిసుఖమయ్యా

(||pallavi||)
harim̐ gŏluvani phala nunubhaviṁchuḍa gāga
yirusaṁdim̐ baḍḍa dehi kem̐ṭi sukhamayya

(||hari||)
tūḍari mosinamobu tŏmmidigaṁtulamenu
kaḍusaṁdim̐ gaṭṭinadi karmabum̐dāḍu
śhaḍim̐ baṁchedriyamulabai taravulum̐ bĕṭṭu
yĕḍabu saṁsārige nem̐ṭi sukhamayyā

(||hari||)
vesi lesi sesĕdi viṣhayamulagu vĕṭṭi
pegulalo tīm̐ṭa radibĕrarem̐pulū
āgaḍubum̐ danalonim̐ yāgali ārani sichchu
yīgadi nuṁḍedehi kem̐ṭisukhamayyā