(॥పల్లవి॥)
హరిహరి నీమహిమ లనంతములు
విరతి జీవులకెల్ల నేరుపులై వున్నవి
(॥హరి॥)
యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి
అందరికిఁ దమతమదై వుండును
కందువ నెవ్వరెవ్వరి కాణాచి యైనదో భూమి
సందడించీఁ బంటలను సకలసస్యములు
(॥హరి॥)
చుట్టుక యం(యెం)దరికిని సొమ్మయినదో కాలము
అట్టె అందరి ఆయుష్యమై యున్నది
గట్టిగా నెవ్వరెవ్వరి కంచము కూడో యీమాయ
దట్టపు సంసారముల ధర్మములై యున్నవి
(॥హరి॥)
ముంచి యం(యెం)దరికై నాను మోపులై వుండీ కర్మము
పంచు కందరికిఁ దమ పనిపాటలై
పంచుక శ్రీవేంకటేశ వారివారి బ్రదుకులు
నించి నీవే యైతివి నిధినిధానమవై
(||pallavi||)
harihari nīmahima lanaṁtamulu
viradi jīvulagĕlla nerubulai vunnavi
(||hari||)
yĕṁdaru bhogiṁchinado yībrahmāṁḍamu dŏlli
aṁdarigim̐ damadamadai vuṁḍunu
kaṁduva nĕvvarĕvvari kāṇāsi yainado bhūmi
saṁdaḍiṁchīm̐ baṁṭalanu sagalasasyamulu
(||hari||)
suṭṭuga yaṁ(yĕṁ)darigini sŏmmayinado kālamu
aṭṭĕ aṁdari āyuṣhyamai yunnadi
gaṭṭigā nĕvvarĕvvari kaṁchamu kūḍo yīmāya
daṭṭabu saṁsāramula dharmamulai yunnavi
(||hari||)
muṁchi yaṁ(yĕṁ)darigai nānu mobulai vuṁḍī karmamu
paṁchu kaṁdarigim̐ dama panibāḍalai
paṁchuga śhrīveṁkaḍeśha vārivāri bradugulu
niṁchi nīve yaidivi nidhinidhānamavai