Haridaasum dagude yadi tabamu

హరిదాసుఁ డగుటే యది తపము
Language

(॥పల్లవి॥)
హరిదాసుఁ డగుటే యది తపము
పరమార్గములను ఫలమే లేదు

(॥హరి॥)
తిట్టినయప్పుడు దీవించినప్పుడు
అట్టె సమ మగునది తపము
వెట్టి నేమములు వేవేలు సేసిన
బట్ట బయలే కాని ఫలమే లేదు

(॥హరి॥)
యిచ్చినయప్పుడు యియ్యనియప్పుడు
అచ్చుగ నవ్విన దది తపము
యిచ్చలఁ బుణ్యము లెన్ని సేసినా
బచ్చన లింతే ఫలమే లేదు

(॥హరి॥)
కూడినయప్పుడు గొణగినయప్పుడు
ఆడిక విడిచిన యది తపము
యీడనె శ్రీ వేంకటేశుఁడే శరణము
పాడి పంతముల ఫలమే లేదు

(||pallavi||)
haridāsum̐ ḍaguḍe yadi tabamu
paramārgamulanu phalame ledu

(||hari||)
tiṭṭinayappuḍu dīviṁchinappuḍu
aṭṭĕ sama magunadi tabamu
vĕṭṭi nemamulu vevelu sesina
baṭṭa bayale kāni phalame ledu

(||hari||)
yichchinayappuḍu yiyyaniyappuḍu
achchuga navvina dadi tabamu
yichchalam̐ buṇyamu lĕnni sesinā
bachchana liṁte phalame ledu

(||hari||)
kūḍinayappuḍu gŏṇaginayappuḍu
āḍiga viḍisina yadi tabamu
yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ḍe śharaṇamu
pāḍi paṁtamula phalame ledu