హరిదాసులతోడ నల్పులు సరెనరాదు
(॥పల్లవి॥)
హరిదాసులతోడ నల్పులు సరెనరాదు
గురుఁడు శిష్యుడుననే గుఱి దప్పుఁగానా
(॥హరి॥)
కోరి ముత్యపుఁజిప్పలఁ గురిసిన వానయు
సారెఁ బెంకులలో వాన సరియౌనా
శ్రీరమణుఁ డిన్నిటానుఁ జేరియుంటేనుండెఁ గాక
సారెకుఁ బాత్రాపాత్రసంగతింతా లేదా
(॥హరి॥)
మలయాద్రి మాఁకులును మహిమీఁది మాఁకులును
చలమున నెంచిచూడ సరియౌనా
అలరి దేవుఁడు అంతర్యామియైతేనాయఁ గాక
తెలియఁగ క్షేత్రవాసి దిక్కులందు లేదా
(॥హరి॥)
అమరుల జన్మములు నసురల జన్మములు
జమళిఁ బుట్టినంతలో సరియౌనా
అమరి శ్రీవేంకటేశుఁ డాతుమైతేనాయఁ గాక
తమితో నధికారిభేదములు లేవా
(||pallavi||)
haridāsuladoḍa nalbulu sarĕnarādu
gurum̐ḍu śhiṣhyuḍunane guṟi dappum̐gānā
(||hari||)
kori mutyabum̐jippalam̐ gurisina vānayu
sārĕm̐ bĕṁkulalo vāna sariyaunā
śhrīramaṇum̐ ḍinniḍānum̐ jeriyuṁṭenuṁḍĕm̐ gāga
sārĕgum̐ bātrābātrasaṁgadiṁtā ledā
(||hari||)
malayādri mām̐kulunu mahimīm̐di mām̐kulunu
salamuna nĕṁchisūḍa sariyaunā
alari devum̐ḍu aṁtaryāmiyaidenāyam̐ gāga
tĕliyam̐ga kṣhetravāsi dikkulaṁdu ledā
(||hari||)
amarula janmamulu nasurala janmamulu
jamaḽim̐ buṭṭinaṁtalo sariyaunā
amari śhrīveṁkaḍeśhum̐ ḍādumaidenāyam̐ gāga
tamido nadhigāribhedamulu levā