(॥పల్లవి॥)
హరిదాసుల మహి మల్లదివో
నరులు యిదే నమ్ముట గాక
(॥హరి॥)
పెక్కు తపస్యులు పెద్దలు ఋషులు
చుక్కలై యున్నారు చూచితిరా
యెక్కడి ముగితి యెవ్వరి కున్నది
వొక్కశుకునకే యొనరెఁ గాక
(॥హరి॥)
తీరని యమృతపు దేవత లిందరు
మేరువం దున్నారు మెచ్చితిరా
యీరీతి వైకుంఠ మెవ్వరి కున్నది
నారదాదులకే ననిచెఁ గాక
(॥హరి॥)
అందు నీకాకాతమసటి బ్రహ్మముఁ
బొంది యెవ్వరైనఁ బొడగంటిరా
విందువలెనే శ్రీవేంకటేశ్వరునిఁ
జెంది పరమ్ములు చేకొంటిరా
(||pallavi||)
haridāsula mahi malladivo
narulu yide nammuḍa gāga
(||hari||)
pĕkku tabasyulu pĕddalu ṛṣhulu
sukkalai yunnāru sūsidirā
yĕkkaḍi mugidi yĕvvari kunnadi
vŏkkaśhugunage yŏnarĕm̐ gāga
(||hari||)
tīrani yamṛtabu devada liṁdaru
meruvaṁ dunnāru mĕchchidirā
yīrīdi vaiguṁṭha mĕvvari kunnadi
nāradādulage nanisĕm̐ gāga
(||hari||)
aṁdu nīgāgādamasaḍi brahmamum̐
bŏṁdi yĕvvarainam̐ bŏḍagaṁṭirā
viṁduvalĕne śhrīveṁkaḍeśhvarunim̐
jĕṁdi parammulu segŏṁṭirā