Haribhakti galigide anniyu mukhyamu gaaga

హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
Language

(॥పల్లవి॥)
హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
విరసాచారము లెల్ల వృథా వృథా

(॥హరి॥)
మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా
కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా
నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా
చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా

(॥హరి॥)
పులులు గుహ నుంటే పోలింప ఋషులా
యెలుపు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా
యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా
వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా

(॥హరి॥)
మాకులు మాట లాడవు మౌనవ్రతములా
కోక గట్టను బాలులు కోరి దిగంబరులా
పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను
చేకొని లోకములోని చెల్లుబడులే

(||pallavi||)
haribhakti galigide anniyu mukhyamu gāga
virasāsāramu lĕlla vṛthā vṛthā

(||hari||)
mikkili nīḍa munim̐ge mīnu kadi snānamā
kŏkkĕradhyānamu sesugŏre adi yogamā
nikki mega āgu meyu niṁḍa nade tabamā
sikki talagiṁdu vele jibbaḍāyi siddhum̐ḍā

(||hari||)
pululu guha nuṁṭe poliṁpa ṛṣhulā
yĕlubu gaḍḍamu vesu niṁtalone yogyum̐ḍā
yilam̐bakṣhu lāgāśhāna kem̐gide devadalā
vŏlasi kom̐ti yaḍavi nuṁṭe vanavāsamā

(||hari||)
māgulu māḍa lāḍavu maunavradamulā
koga gaṭṭanu bālulu kori digaṁbarulā
pai kŏni śhrīveṁkaḍeśhu bhaktam̐ ḍemi sesinānu
segŏni logamuloni sĕllubaḍule