Haribamta haribamta haribamtanu maabaim

హరిబంట హరిబంట హరిబంటను మాపైఁ
Language

(॥పల్లవి॥)
హరిబంట హరిబంట హరిబంటను మాపైఁ
దర వేల మమ్ము నిఁకఁ దడవకురో

(॥హరి॥)
పంచేంద్రియములాల బడి బడి మీ పంపు
కొంచక సేసితి నిఁక గొలువ నోప
వంచన లేక హరివారకము లందుకొంటి
యించుకంత గడి చిది యియ్యఁగదరో

(॥హరి॥)
కట్టిడి యాసలాల కలకాలము మీకు
వెట్టి సేసి వెట్టి సేసి వేసరితిని
గుట్టుతో నే హరిచేతికొంగుబత్య మందుకొంటి
గట్టిగాఁగ నుత్తరువు కల దించరో

(॥హరి॥)
అనుగుఁ బ్రాయపు మోహములాల యిన్నాళ్ళు
చనవరినై మీసరి నుంటిని
ఘనుఁడైన శ్రీవేంకటపతిఁ గొలిచితి
వెనకకు వీడుకోలువీడె మియ్యరో

(||pallavi||)
haribaṁṭa haribaṁṭa haribaṁṭanu mābaim̐
dara vela mammu nim̐kam̐ daḍavaguro

(||hari||)
paṁcheṁdriyamulāla baḍi baḍi mī paṁpu
kŏṁchaga sesidi nim̐ka gŏluva noba
vaṁchana lega harivāragamu laṁdugŏṁṭi
yiṁchugaṁta gaḍi sidi yiyyam̐gadaro

(||hari||)
kaṭṭiḍi yāsalāla kalagālamu mīgu
vĕṭṭi sesi vĕṭṭi sesi vesaridini
guṭṭudo ne harisedigŏṁgubatya maṁdugŏṁṭi
gaṭṭigām̐ga nuttaruvu kala diṁcharo

(||hari||)
anugum̐ brāyabu mohamulāla yinnāḽḽu
sanavarinai mīsari nuṁṭini
ghanum̐ḍaina śhrīveṁkaḍabadim̐ gŏlisidi
vĕnagagu vīḍugoluvīḍĕ miyyaro