హరి యేమనెనే హరి యేమనెనే అలిగెనో
(॥పల్లవి॥)
హరి యేమనెనే హరి యేమనెనే అలిగెనో
విరహినై నే వేగించఁగా వేగించఁగా యాల రాఁడాయ యాల రాఁడాయ
(॥హరి॥)
మఱచీ తప్పీ తను మాటాడితినా
యెఱుకగలవిభుఁడు యేమనెనే
తెలువలే వచ్చిరి తెరలుచుఁ దా రాఁడు
యెఱిగితిఁ దనకత లేమనెనే
(॥హరి॥)
వాకిటి కిందాఁక వచ్చి తిరిగె నట
యేకారణ మిదీ యేమనెనే
రాకలఁబోకల రాతి రాయ నిదే
యీకడ తుదమా టేమనెనే
(॥హరి॥)
తలఁపులో ప్రియము తానే యెఱుఁగును
యెలుగెత్తి యొకమాటు యేమనెనే
బలిమి శ్రీవేంకటపతి దా విచ్చేసి
యిల ననుఁగూడెను యేమనెనే
(||pallavi||)
hari yemanĕne hari yemanĕne aligĕno
virahinai ne vegiṁcham̐gā vegiṁcham̐gā yāla rām̐ḍāya yāla rām̐ḍāya
(||hari||)
maṟasī tappī tanu māḍāḍidinā
yĕṟugagalavibhum̐ḍu yemanĕne
tĕluvale vachchiri tĕralusum̐ dā rām̐ḍu
yĕṟigidim̐ danagada lemanĕne
(||hari||)
vāgiḍi kiṁdām̐ka vachchi tirigĕ naḍa
yegāraṇa midī yemanĕne
rāgalam̐bogala rādi rāya nide
yīgaḍa tudamā ṭemanĕne
(||hari||)
talam̐pulo priyamu tāne yĕṟum̐gunu
yĕlugĕtti yŏgamāḍu yemanĕne
balimi śhrīveṁkaḍabadi dā vichchesi
yila nanum̐gūḍĕnu yemanĕne