(॥పల్లవి॥)
హరి యేమనెనే అలిగెనో
విరహినై నేనుండఁగా యేల రాఁడాయ
(॥హరి॥)
మరలి మరలి తన్ను మాటలఁ గొసరను
యిరవైన విభుఁడేమనెనే
తరుణులే వచ్చితిరి తానాడనున్నాఁడు
యెరవెరవై తానేమనెనే
(॥హరి॥)
వాకిటికిందాఁక వచ్చి తిరిగెనట
యేకారణమిది యేమనెనే
రాకలఁ బోకల రాతిరాయనిదె
యీకడఁ దుదమాఁటేమనెనే
(॥హరి॥)
తలపులో ప్రియరము తానే యెరుఁగును
యెలుఁ గెత్తొకమాఁటేమనెనే
బలిమి శ్రీవేంకటపతి దా విచ్చేసి
యిల ననుఁగూడెను యేమనెనే
(||pallavi||)
hari yemanĕne aligĕno
virahinai nenuṁḍam̐gā yela rām̐ḍāya
(||hari||)
marali marali tannu māḍalam̐ gŏsaranu
yiravaina vibhum̐ḍemanĕne
taruṇule vachchidiri tānāḍanunnām̐ḍu
yĕravĕravai tānemanĕne
(||hari||)
vāgiḍigiṁdām̐ka vachchi tirigĕnaḍa
yegāraṇamidi yemanĕne
rāgalam̐ bogala rādirāyanidĕ
yīgaḍam̐ dudamām̐ṭemanĕne
(||hari||)
talabulo priyaramu tāne yĕrum̐gunu
yĕlum̐ gĕttŏgamām̐ṭemanĕne
balimi śhrīveṁkaḍabadi dā vichchesi
yila nanum̐gūḍĕnu yemanĕne