Hari vishvaatmagumdu amdarilo nunnavaamdu

హరి విశ్వాత్మకుఁడు అందరిలో నున్నవాఁడు
Language

(॥పల్లవి॥)
హరి విశ్వాత్మకుఁడు అందరిలో నున్నవాఁడు
దరిసించి బ్రదుకరో తప్పు లేదు యింకను

(॥హరి॥)
దారుపాషాణములందు దైవముగా భావించి
కూరిమితో మీకు మీకె కొలిచేవారా
చేరి ప్రాణప్రతిష్టలు సేసేనాఁడు దేవుఁడే
కోరిక వైష్ణవులందు కొలువరో మీరు

(॥హరి॥)
వేదపురాణార్థమందు విశ్వాసము వెట్టుకొని
సోదించి తెలుసుకొనే సుగుడులాల
వేదమె మాటలుగాను వివరించే వైష్ణవులు
ఆదిగురువులు వీరి నడుగరో మీరు

(॥హరి॥)
దేవుఁడె పెక్కురూపులై తేరి యెదుట నుండఁగా
ఆవల వెదకఁబొయ్యే ఆసక్తులాల
శ్రీ వేంకటేశుఁడె మతిఁ జిక్కినాఁడు దాసులకు
తావుకొని హరినాత్మఁ దలఁచరో మీరు

(||pallavi||)
hari viśhvātmagum̐ḍu aṁdarilo nunnavām̐ḍu
darisiṁchi bradugaro tappu ledu yiṁkanu

(||hari||)
dārubāṣhāṇamulaṁdu daivamugā bhāviṁchi
kūrimido mīgu mīgĕ kŏlisevārā
seri prāṇapradiṣhṭalu sesenām̐ḍu devum̐ḍe
koriga vaiṣhṇavulaṁdu kŏluvaro mīru

(||hari||)
vedaburāṇārdhamaṁdu viśhvāsamu vĕṭṭugŏni
sodiṁchi tĕlusugŏne suguḍulāla
vedamĕ māḍalugānu vivariṁche vaiṣhṇavulu
ādiguruvulu vīri naḍugaro mīru

(||hari||)
devum̐ḍĕ pĕkkurūbulai teri yĕduḍa nuṁḍam̐gā
āvala vĕdagam̐bŏyye āsaktulāla
śhrī veṁkaḍeśhum̐ḍĕ madim̐ jikkinām̐ḍu dāsulagu
tāvugŏni harinātmam̐ dalam̐saro mīru