హరి నిన్నుఁ బిలిచీని అదిగో వమ్మా
(॥పల్లవి॥)
హరి నిన్నుఁ బిలిచీని అదిగో వమ్మా
తెరమఱఁ గిఁకనేల తియ్యవమ్మా
(॥హరి॥)
చిత్తరు పతిమవంటి చెలియా
యిత్తల పతికి విడె మియ్యవమ్మా
కొతమెఱుఁగుఁ బోలిన కోమలి
మొత్తమి కూరిమిపతిమోము చూడవమ్మా
(॥హరి॥)
బంగారుబొమ్మవంటి పడఁతి
అంగవించి పతితో మాఁటాడవమ్మా
అంగజు శరమువంటి అతివె నీకు
నంగతన మిది యాల నవ్వవవమ్మా
(॥హరి॥)
చంచుల చిగురువంటి జవ్వని
కొంచక శ్రేంకటేశుఁ గూడితివమ్మా
మించుఁదమ్మిలోని యలమేలుమంగా
యెంచి యెద్దరును మమ్ము నేలరమ్మా
(||pallavi||)
hari ninnum̐ bilisīni adigo vammā
tĕramaṟam̐ gim̐kanela tiyyavammā
(||hari||)
sittaru padimavaṁṭi sĕliyā
yittala padigi viḍĕ miyyavammā
kŏdamĕṟum̐gum̐ bolina komali
mŏttami kūrimibadimomu sūḍavammā
(||hari||)
baṁgārubŏmmavaṁṭi paḍam̐ti
aṁgaviṁchi padido mām̐ṭāḍavammā
aṁgaju śharamuvaṁṭi adivĕ nīgu
naṁgadana midi yāla navvavavammā
(||hari||)
saṁchula siguruvaṁṭi javvani
kŏṁchaga śhreṁkaḍeśhum̐ gūḍidivammā
miṁchum̐dammiloni yalamelumaṁgā
yĕṁchi yĕddarunu mammu nelarammā