హరి నీవు నాకు లంచ మేమిచ్చేవు అన్ని మర్మములు చెప్పుదునా
(॥పల్లవి॥)
హరి నీవు నాకు లంచ మేమిచ్చేవు అన్ని మర్మములు చెప్పుదునా
దొరవంటా మొక్కి నీ దాసులతోడ తుచ్ఛపు నీ చేఁత చెప్పుదునా
(॥హరి॥)
ఆల్లనాఁడు నీవు మైలన్న చొక్కయ్య నంటుకొన్నసుద్దిచెప్పుదునా
గొల్లెతలవాడ చీఁకటి నీ తప్పు కోరి చేసినది చెప్పుదునా
వెల్లివిరిగా రేపల్లెలోపలి వెన్నముచ్చిమలు చెప్పుదునా
తల్లిబిడ్డ నొక్కవానిగఁ జేసిన ధర్మపుతగవు చెప్పుదునా
(॥హరి॥)
మేటి మీనవై ఆఁకటికిఁ జిన్నమీలఁ దిన్నసుద్ది చెప్పుదునా
పాటించి నీ సరిబావమరఁదికి బండి రొప్పినది చెప్పుదునా
గాటపు టసురకామినులతోడ కల్ల లాడినది చెప్పుదునా
యీటువెట్టుకొని నీపు బోయదాని యెంగిలి దిన్నది చెప్పుదునా
(॥హరి॥)
దీనవృత్తిఁ బోయి బలిచక్రవర్తిఁ దిరిసికొన్నది చెప్పుదునా
ఆనించి శ్రీపతిపాదాలు నీమెడ నంట గట్టుకొంట చెప్పుదునా
దానవాంతక శ్రీ వేంకటేశ్వర దైవమని నిన్నుఁజెప్పుదునా
పానిపట్టి శరణంటేఁ గాచేట పర మేకాంతము చెప్పుదునా
(||pallavi||)
hari nīvu nāgu laṁcha memichchevu anni marmamulu sĕppudunā
dŏravaṁṭā mŏkki nī dāsuladoḍa tuchchhabu nī sem̐ta sĕppudunā
(||hari||)
āllanām̐ḍu nīvu mailanna sŏkkayya naṁṭugŏnnasuddisĕppudunā
gŏllĕdalavāḍa sīm̐kaḍi nī tappu kori sesinadi sĕppudunā
vĕllivirigā reballĕlobali vĕnnamuchchimalu sĕppudunā
tallibiḍḍa nŏkkavānigam̐ jesina dharmabudagavu sĕppudunā
(||hari||)
meḍi mīnavai ām̐kaḍigim̐ jinnamīlam̐ dinnasuddi sĕppudunā
pāḍiṁchi nī saribāvamaram̐digi baṁḍi rŏppinadi sĕppudunā
gāḍabu ṭasuragāminuladoḍa kalla lāḍinadi sĕppudunā
yīḍuvĕṭṭugŏni nību boyadāni yĕṁgili dinnadi sĕppudunā
(||hari||)
dīnavṛttim̐ boyi balisakravardim̐ dirisigŏnnadi sĕppudunā
āniṁchi śhrībadibādālu nīmĕḍa naṁṭa gaṭṭugŏṁṭa sĕppudunā
dānavāṁtaga śhrī veṁkaḍeśhvara daivamani ninnum̐jĕppudunā
pānibaṭṭi śharaṇaṁṭem̐ gāseḍa para megāṁtamu sĕppudunā