హరి నీవే దిక్కు గాని యట వుపాయము లేదు
(॥పల్లవి॥)
హరి నీవే దిక్కు గాని యట వుపాయము లేదు
కరుణానిధివి నన్నుఁ గావవే యిఁకను
(॥హరి॥)
కర్మము లనుభవించి కడతేర దాయెను
ధర్మములు సేసియుఁ గ్రోధము వోదాయె
నర్మిలి బొందులు మోచి యలయిక లేదాయె
నిర్మల మౌట యెన్నఁడు నెట్టన నా బ్రదుకు
(॥హరి॥)
చుట్టి నానాలోకములు చొచ్చి సిగ్గుగాదాయె
పొట్టు వొర్లై చదివి నొబ్బుద్ది గాదాయె
వొట్టిన రాత్రుల నిద్ర నొందియుఁ దనియదాయె
గట్టియై నిల్చుట యేకాలము నాబ్రదుకు
(॥హరి॥)
తపముల బడలినా దర్పము విడువదాయె
వుపను నెందరిఁ గొల్చి వొప్పు గాదాయె
యిప్పుడు శ్రీవేంకటేశ యిటు నీకు మొక్కఁగాను
కృపచేసితి వీడేరెఁ గిందటి నా బదుకు
(||pallavi||)
hari nīve dikku gāni yaḍa vubāyamu ledu
karuṇānidhivi nannum̐ gāvave yim̐kanu
(||hari||)
karmamu lanubhaviṁchi kaḍadera dāyĕnu
dharmamulu sesiyum̐ grodhamu vodāyĕ
narmili bŏṁdulu mosi yalayiga ledāyĕ
nirmala mauḍa yĕnnam̐ḍu nĕṭṭana nā bradugu
(||hari||)
suṭṭi nānālogamulu sŏchchi siggugādāyĕ
pŏṭṭu vŏrlai sadivi nŏbbuddi gādāyĕ
vŏṭṭina rātrula nidra nŏṁdiyum̐ daniyadāyĕ
gaṭṭiyai nilsuḍa yegālamu nābradugu
(||hari||)
tabamula baḍalinā darbamu viḍuvadāyĕ
vubanu nĕṁdarim̐ gŏlsi vŏppu gādāyĕ
yippuḍu śhrīveṁkaḍeśha yiḍu nīgu mŏkkam̐gānu
kṛpasesidi vīḍerĕm̐ giṁdaḍi nā badugu