Hari needaasulabhaagya midi yemtani seppemu

హరి నీదాసులభాగ్య మిది యెంతని చెప్పేము
Language

(॥పల్లవి॥)
హరి నీదాసులభాగ్య మిది యెంతని చెప్పేము
విరివైన నీ సుద్దులు వింటిమయ్యా

(॥హరి॥)
నెమ్మదిని నీవనేటి నిధానము గన్నవారు
కిమ్ముల సంపన్నుల సుఖింతురయ్యా
కమ్మటి నీభక్తియనే కామధేను వున్నవారు
వుమ్మడి నచ్చికము లేకుందరయ్యా

(॥హరి॥)
చేరి నీపై చింతయనే చింతామణిగలవారు
కోరినట్టల్లా బదుకుదురయ్యా
సారపు నీకృపాపారిజాత మబ్బినవారు
బోరన సంతోసాలఁ బొదలుదురయ్యా

(॥హరి॥)
హత్తి నీనామమనే అమృతముగలవారు
నిత్తెమైన పదవుల నిలుతురయ్యా
యిత్తల శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సత్తుగా నీవారు నాకుఁ జనవిత్తురయ్యా

(||pallavi||)
hari nīdāsulabhāgya midi yĕṁtani sĕppemu
virivaina nī suddulu viṁṭimayyā

(||hari||)
nĕmmadini nīvaneḍi nidhānamu gannavāru
kimmula saṁpannula sukhiṁturayyā
kammaḍi nībhaktiyane kāmadhenu vunnavāru
vummaḍi nachchigamu leguṁdarayyā

(||hari||)
seri nībai siṁtayane siṁtāmaṇigalavāru
korinaṭṭallā badugudurayyā
sārabu nīkṛpābārijāda mabbinavāru
borana saṁtosālam̐ bŏdaludurayyā

(||hari||)
hatti nīnāmamane amṛtamugalavāru
nittĕmaina padavula niludurayyā
yittala śhrīveṁkaḍeśha inniḍā nannelidivi
sattugā nīvāru nāgum̐ janavitturayyā