హరి నీ దాస్యమునకు నది యేమి సరిగావు
(॥పల్లవి॥)
హరి నీ దాస్యమునకు నది యేమి సరిగావు
అరయ శుకుడు నిన్ను నఁటి??? నీయంతాయను
(॥హరి॥)
వగలఁ దపము సేసి వసిష్ట నయ్యే నంటే
వొగి వసిష్టుఁడు మింట నొక్క చుక్కే
యెగువ యజ్ఞాలు సేసి యింద్రుఁడ నయ్యే నంటే
దిగువ నా యింద్రుఁ డొక్క దిక్పాలుఁడే
(॥హరి॥)
ఘనమైన యీవు లిచ్చి కర్ణుఁడ నయ్యే నంటే
వొనర నాతఁడు భువి నొక్క రాజే
అనువై దానాలు సేసి అమరత్వ మందే నంటే
కొన నది మేరువు కొండమీఁది బ్రదుకే
(॥హరి॥)
అదిగాన యే యుపాయములు నే నొల్లక
కదిసి నీ శరణనే గతి గంటిని
యెదుట శ్రీ వేంకటేశ యిట్టి నా దెస చూచి
సదయుఁడవై మమ్ము చక్కఁగ నేలితివి
(||pallavi||)
hari nī dāsyamunagu nadi yemi sarigāvu
araya śhuguḍu ninnu nam̐ṭi??? nīyaṁtāyanu
(||hari||)
vagalam̐ dabamu sesi vasiṣhṭa nayye naṁṭe
vŏgi vasiṣhṭum̐ḍu miṁṭa nŏkka sukke
yĕguva yajñālu sesi yiṁdrum̐ḍa nayye naṁṭe
diguva nā yiṁdrum̐ ḍŏkka dikpālum̐ḍe
(||hari||)
ghanamaina yīvu lichchi karṇum̐ḍa nayye naṁṭe
vŏnara nādam̐ḍu bhuvi nŏkka rāje
anuvai dānālu sesi amaratva maṁde naṁṭe
kŏna nadi meruvu kŏṁḍamīm̐di braduge
(||hari||)
adigāna ye yubāyamulu ne nŏllaga
kadisi nī śharaṇane gadi gaṁṭini
yĕduḍa śhrī veṁkaḍeśha yiṭṭi nā dĕsa sūsi
sadayum̐ḍavai mammu sakkam̐ga nelidivi