(॥పల్లవి॥)
హరి నారాయణ ఆదిమపరుషుఁడ
సరవి నీ నామమె జనరక్షణము
(॥హరి॥)
భవసాగరమునఁ బడిన జీవునికి
యివల నీ నామం బది దేప
తవిలి క్రోధ మనుతాపపు టిండ్లకు
జవళి నీ నామస్మరణే నీడ
(॥హరి॥)
నెట్టన మాయల నిరాదారులకు
పట్టుగొమ్మ నీ పరనామము
అట్టె దురాసలను పెను గాలికి
గట్టిగా నీ నామకతలె చాటు
(॥హరి॥)
పండిన సంసారబహురాజ్యమునకు
అండనె నీ నామ మటు దిక్కు
నిండు శ్రీవేంకటనిలయ మాకు నీ
దండి నామకీర్తనమే ఫలము
(||pallavi||)
hari nārāyaṇa ādimabaruṣhum̐ḍa
saravi nī nāmamĕ janarakṣhaṇamu
(||hari||)
bhavasāgaramunam̐ baḍina jīvunigi
yivala nī nāmaṁ badi deba
tavili krodha manudābabu ṭiṁḍlagu
javaḽi nī nāmasmaraṇe nīḍa
(||hari||)
nĕṭṭana māyala nirādārulagu
paṭṭugŏmma nī paranāmamu
aṭṭĕ durāsalanu pĕnu gāligi
gaṭṭigā nī nāmagadalĕ sāḍu
(||hari||)
paṁḍina saṁsārabahurājyamunagu
aṁḍanĕ nī nāma maḍu dikku
niṁḍu śhrīveṁkaḍanilaya māgu nī
daṁḍi nāmagīrdaname phalamu