(॥పల్లవి॥)
హరి గోవిందా హరి గోవిందా - ఆనంద మానంద మాతుమకును
గురూపదేశాన వెదకఁగా వెదకఁగా - గరిమ నీయర్థము కంటిమో యయ్యా
(॥హరి॥)
హరి నన్యధర్మములు మానుమంటివి - శరణు నీకుఁ జొరుమంటివి
దురితము లణఁచేనంటివి - పరగ మోక్షం బిచ్చేనంటివి
హరి నీవచనము అమోఘము - నరులము నే మిది నమ్మితిమి
పరమపద మిప్పుడే కలిగేను- ధర నొక్కమనసుతో నున్నారమయ్యా
(॥హరి॥)
యెందు నీవే గతి యనుమంటివి - యేచి యొక్కమాఁటే చాలునంటివి
యిందరి కభయ మిత్తునంటివి - యిది నీకెపుడు వ్రతమంటివి
కందువ నీబిరుదు సత్యము - కానిమ్మని నేము చేపట్టితిమి
అంది నీవే మాకు దిక్కైతివి - అన్నిటా సంతోసాన నున్నారమయ్యా
(॥హరి॥)
ఆస మానినవాఁడెక్కు డంటివి- ఆతనివెంటఁ దిరిగేనంటివి
భాసురపాదరేణువు నే నంటివి- పావన మయ్యేనని యంటివి
మోసలేనిది నీసంకల్పము -మొక్కే మిందులకు శ్రీవేంకటేశా
ఆసపడ నితరుల నాకు నీవే యాస - యని నీదాసులమై యున్నారమయ్యా
(||pallavi||)
hari goviṁdā hari goviṁdā - ānaṁda mānaṁda mādumagunu
gurūbadeśhāna vĕdagam̐gā vĕdagam̐gā - garima nīyardhamu kaṁṭimo yayyā
(||hari||)
hari nanyadharmamulu mānumaṁṭivi - śharaṇu nīgum̐ jŏrumaṁṭivi
duridamu laṇam̐senaṁṭivi - paraga mokṣhaṁ bichchenaṁṭivi
hari nīvasanamu amoghamu - narulamu ne midi nammidimi
paramabada mippuḍe kaligenu- dhara nŏkkamanasudo nunnāramayyā
(||hari||)
yĕṁdu nīve gadi yanumaṁṭivi - yesi yŏkkamām̐ṭe sālunaṁṭivi
yiṁdari kabhaya mittunaṁṭivi - yidi nīgĕbuḍu vradamaṁṭivi
kaṁduva nībirudu satyamu - kānimmani nemu sebaṭṭidimi
aṁdi nīve māgu dikkaidivi - anniḍā saṁtosāna nunnāramayyā
(||hari||)
āsa māninavām̐ḍĕkku ḍaṁṭivi- ādanivĕṁṭam̐ dirigenaṁṭivi
bhāsurabādareṇuvu ne naṁṭivi- pāvana mayyenani yaṁṭivi
mosalenidi nīsaṁkalbamu -mŏkke miṁdulagu śhrīveṁkaḍeśhā
āsabaḍa nidarula nāgu nīve yāsa - yani nīdāsulamai yunnāramayyā