Guttusesugunnaamdavu kori yamdarimumdara

గుట్టుసేసుకున్నాఁడవు కోరి యందరిముందర
Language

(॥పల్లవి॥)
గుట్టుసేసుకున్నాఁడవు కోరి యందరిముందర
తొట్టెనో వేడుకలెల్లా దొరవై వున్నాఁడవు

(॥గుట్టు॥)
ఆతివఁ జూచినచూపు అచ్చొత్తినట్ల నీ-
మతిలో నున్నదో మాటలాడవు
తతి నాకెమాటలు తఱచై నీచెవులలోఁ
బతినాదా లిచ్చీనో పరాకైతివి

(॥గుట్టు॥)
అంగనమోవితేనెలఅన్ను వట్టెనో నీకు
వుంగిటిగొన్నట్టు వూరకున్నాఁడవు
సంగడి నాపెమైతావి సారె వాసనవచ్చెనో
అంగవించి యందే వోలలాడుతానున్నాఁడవు

(॥గుట్టు॥)
అలమేలుమంగరతు లట్టె మరిగితివో
వెలయుచు నిలువున వెరగందేవు
అలరి శ్రీవేంకటేశ ఆకె నిన్ను బోదించెనో
తలచి నన్నుఁగూడి తమకించేవు

(||pallavi||)
guṭṭusesugunnām̐ḍavu kori yaṁdarimuṁdara
tŏṭṭĕno veḍugalĕllā dŏravai vunnām̐ḍavu

(||guṭṭu||)
ādivam̐ jūsinasūbu achchŏttinaṭla nī-
madilo nunnado māḍalāḍavu
tadi nāgĕmāḍalu taṟasai nīsĕvulalom̐
badinādā lichchīno parāgaidivi

(||guṭṭu||)
aṁganamovidenĕlaannu vaṭṭĕno nīgu
vuṁgiḍigŏnnaṭṭu vūragunnām̐ḍavu
saṁgaḍi nābĕmaidāvi sārĕ vāsanavachchĕno
aṁgaviṁchi yaṁde volalāḍudānunnām̐ḍavu

(||guṭṭu||)
alamelumaṁgaradu laṭṭĕ marigidivo
vĕlayusu niluvuna vĕragaṁdevu
alari śhrīveṁkaḍeśha āgĕ ninnu bodiṁchĕno
talasi nannum̐gūḍi tamagiṁchevu