గుట్టున నుండుటే మేలు కొసరఁగఁ బనిలేదు
(॥పల్లవి॥)
గుట్టున నుండుటే మేలు కొసరఁగఁ బనిలేదు
బట్టబయలీఁదఁగాను పనికివచ్చీనా
(॥గుట్టు॥)
వలసీనొల్లపతివద్ద నెంతవిలుచున్నా
తలఁపులో నీకిట్టె దయవుట్టీనా
సొలసిసొలసి యెంత సోబానఁ బాడినాను
పిలువని పేరటము ప్రియమయ్యీనా
(॥గుట్టు॥)
చనవులేని యింతి సరన మెం తాడినాను
పెనగొని నీకిఁకఁ బ్రేమవుట్టీనా
మనవితో నిచ్చకము మాపుదాఁకాఁ జేసినాను
వొనరనినేస్తములు వొద్దికయ్యీనా
(॥గుట్టు॥)
ననుపుగానిచెలి నవ్వు లెన్ని నవ్వినాను
తనిసి వుందువుగాక తమకించేవా
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
వెనకటివారిపొందు వేడుకయ్యీనా
(||pallavi||)
guṭṭuna nuṁḍuḍe melu kŏsaram̐gam̐ baniledu
baṭṭabayalīm̐dam̐gānu panigivachchīnā
(||guṭṭu||)
valasīnŏllabadivadda nĕṁtavilusunnā
talam̐pulo nīgiṭṭĕ dayavuṭṭīnā
sŏlasisŏlasi yĕṁta sobānam̐ bāḍinānu
piluvani peraḍamu priyamayyīnā
(||guṭṭu||)
sanavuleni yiṁti sarana mĕṁ tāḍinānu
pĕnagŏni nīgim̐kam̐ bremavuṭṭīnā
manavido nichchagamu mābudām̐kām̐ jesinānu
vŏnaraninestamulu vŏddigayyīnā
(||guṭṭu||)
nanubugānisĕli navvu lĕnni navvinānu
tanisi vuṁduvugāga tamagiṁchevā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
vĕnagaḍivāribŏṁdu veḍugayyīnā