గుట్టున నుండుటచాలు కూడినదాఁకా
(॥పల్లవి॥)
గుట్టున నుండుటచాలు కూడినదాఁకా
అట్టె ఆమీఁది పను లప్పుడే చెప్పేను
(॥॥)
చూడకురా అద్దము సొంపగు నీ నుదుటను
యేడో లత్తుక చూచి యెంత సిగ్గవునో
ఆడకురా మాఁటలు ఆయపునీమోవిమీఁది-
నీడ కెంపులు రాఁగితే నీ కెంత నొచ్చునో
(॥॥)
వెలి వెళ్ళకురా నీవేఁడిచెమట గారితే
చెలుల మెదుట నెంత చింత వుట్టునో
కులికి నవ్వకురా కొప్పుసేస రాలితే
యెలమి నీబాసలు నిన్నేమనునో
(॥॥)
కాఁగిటఁ బెనఁగకురా కమ్మఁగస్తూరిబేంట్లు
చేఁగలై రాలితే నీచిత్త మెట్టవునో
తూఁగుబడి నన్ను నీవు తోడుతనే కూడితివి
పాఁగిన శ్రీవేంకటేశ పచ్చి యెంత దోఁచునో
(||pallavi||)
guṭṭuna nuṁḍuḍasālu kūḍinadām̐kā
aṭṭĕ āmīm̐di panu lappuḍe sĕppenu
(||||)
sūḍagurā addamu sŏṁpagu nī nuduḍanu
yeḍo lattuga sūsi yĕṁta siggavuno
āḍagurā mām̐ṭalu āyabunīmovimīm̐di-
nīḍa kĕṁpulu rām̐gide nī kĕṁta nŏchchuno
(||||)
vĕli vĕḽḽagurā nīvem̐ḍisĕmaḍa gāride
sĕlula mĕduḍa nĕṁta siṁta vuṭṭuno
kuligi navvagurā kŏppusesa rālide
yĕlami nībāsalu ninnemanuno
(||||)
kām̐giḍam̐ bĕnam̐gagurā kammam̐gastūribeṁṭlu
sem̐galai rālide nīsitta mĕṭṭavuno
tūm̐gubaḍi nannu nīvu toḍudane kūḍidivi
pām̐gina śhrīveṁkaḍeśha pachchi yĕṁta dom̐suno