(॥పల్లవి॥)
గుట్టున నుండవే కోమలి
జట్టిగొనుచు నిను జరసీ నిపుడు
(॥॥)
సముకాన నతఁడు సరసమాడఁగా
తమకించకువే తరుణీ
చెమటలు నీమేనఁజిప్పిలఁగఁజూచి
తిమురుచు రమణుఁడు తెగడీ నిపుడు
(॥॥)
చెలిమి సేసి పతి చేకొనఁగానే
బలిమి సేయకువె పడఁతీ
పులకలు చెక్కుల పొదిగొనఁగనుగొని
నలుగడఁదా నటు నవ్వీ నిపుడు
(॥॥)
సొరిది శ్రీ వేంకటేశుఁడు గూడఁగానె
గరిసించ నేఁటికే కలికీ
నిరతి మోమునఁ గళ నిండఁగ దిష్టించి
కెరలుచు నీతఁడే కేరీ నిపుడు
(||pallavi||)
guṭṭuna nuṁḍave komali
jaṭṭigŏnusu ninu jarasī nibuḍu
(||||)
samugāna nadam̐ḍu sarasamāḍam̐gā
tamagiṁchaguve taruṇī
sĕmaḍalu nīmenam̐jippilam̐gam̐jūsi
timurusu ramaṇum̐ḍu tĕgaḍī nibuḍu
(||||)
sĕlimi sesi padi segŏnam̐gāne
balimi seyaguvĕ paḍam̐tī
pulagalu sĕkkula pŏdigŏnam̐ganugŏni
nalugaḍam̐dā naḍu navvī nibuḍu
(||||)
sŏridi śhrī veṁkaḍeśhum̐ḍu gūḍam̐gānĕ
garisiṁcha nem̐ṭige kaligī
niradi momunam̐ gaḽa niṁḍam̐ga diṣhṭiṁchi
kĕralusu nīdam̐ḍe kerī nibuḍu