Guttuna nooragumdude gunamu gaaga

గుట్టున నూరకుండుటే గుణము గాక
Language

(॥పల్లవి॥)
గుట్టున నూరకుండుటే గుణము గాక
పట్టి పెనఁగేటివారి పస లేఁటివే

(॥గుట్టు॥)
కన్నులనే మెచ్చెఁగాని కరఁగఁ డాయన మనసు
యిన్నిటా విన్నపము లిఁక నేఁటివే
సన్నలనే నవ్వెఁ గాని సంగడికి రాఁడాయ
పన్నిన నామొక్కులకుఁ బాటి యేడదే

(॥గుట్టు॥)
చనవులే యిచ్చెఁ గాని చవు లేమిఁజూడఁ డాయ
ననిచినతనవొద్ద నాసట నేఁటిదే
తనియఁగఁ జూచెఁ గాని తమకించఁడాయఁ దాను
చెనకి మోతసేసినా సెల వేమి గలదే

(॥గుట్టు॥)
కాఁగిటనే నించెఁ గాని కత లేమిఁ జెప్పఁడాయ
చేఁగనాచన్నుల నిఁకఁ జిమ్మ నేఁటికే
ఆఁగి శ్రీవేంకటపతి అప్పటి నన్నుఁ గలసె
వీఁగనిరతుల కింక వెల యాడదే

(||pallavi||)
guṭṭuna nūraguṁḍuḍe guṇamu gāga
paṭṭi pĕnam̐geḍivāri pasa lem̐ṭive

(||guṭṭu||)
kannulane mĕchchĕm̐gāni karam̐gam̐ ḍāyana manasu
yinniḍā vinnabamu lim̐ka nem̐ṭive
sannalane navvĕm̐ gāni saṁgaḍigi rām̐ḍāya
pannina nāmŏkkulagum̐ bāḍi yeḍade

(||guṭṭu||)
sanavule yichchĕm̐ gāni savu lemim̐jūḍam̐ ḍāya
nanisinadanavŏdda nāsaḍa nem̐ṭide
taniyam̐gam̐ jūsĕm̐ gāni tamagiṁcham̐ḍāyam̐ dānu
sĕnagi modasesinā sĕla vemi galade

(||guṭṭu||)
kām̐giḍane niṁchĕm̐ gāni kada lemim̐ jĕppam̐ḍāya
sem̐ganāsannula nim̐kam̐ jimma nem̐ṭige
ām̐gi śhrīveṁkaḍabadi appaḍi nannum̐ galasĕ
vīm̐ganiradula kiṁka vĕla yāḍade