Guttugalavaamdu gaamgaa gumpimchagunnaamdu gaaga

గుట్టుగలవాఁడు గాఁగా గుంపించకున్నాఁడు గాక
Language

(॥పల్లవి॥)
గుట్టుగలవాఁడు గాఁగా గుంపించకున్నాఁడు గాక
వొట్టుక నేమెల్లాఁ జూచి వోర్వఁగఁగలమా

(॥॥)
అతనినేల దూరేవే అంగడికెక్కె వలపు
యేతులఁ బెండ్లాడినవా రెందరు లేరు
యీతలఁ జెలుల నంపి ఇంటికి రప్పించీని
చేతికి లోనాయనంటే చిమ్మిరేఁచవలెనా

(॥॥)
పంతము లేలా డేవే పట్టరాదు పాయము
వంతులకు నెందరైనా వద్దనున్నారు
వింతలుగా నవ్వుతానే విందారగించఁబెట్టి
బంతిఁగూచుండి విభునిఁ బంగించవలెనా

(॥॥)
సిగ్గులే లలమేల్మంగ శ్రీవేంకటేశుఁడు గూడె
కగ్గులేనిసవతులు గాచుకున్నారు
యెగ్గులేక నన్నునేలె నితనిఁ బానుపుమీఁద
అగ్గలపురతుల నీ వలయిఁచవలెనా

(||pallavi||)
guṭṭugalavām̐ḍu gām̐gā guṁpiṁchagunnām̐ḍu gāga
vŏṭṭuga nemĕllām̐ jūsi vorvam̐gam̐galamā

(||||)
adaninela dūreve aṁgaḍigĕkkĕ valabu
yedulam̐ bĕṁḍlāḍinavā rĕṁdaru leru
yīdalam̐ jĕlula naṁpi iṁṭigi rappiṁchīni
sedigi lonāyanaṁṭe simmirem̐savalĕnā

(||||)
paṁtamu lelā ḍeve paṭṭarādu pāyamu
vaṁtulagu nĕṁdarainā vaddanunnāru
viṁtalugā navvudāne viṁdāragiṁcham̐bĕṭṭi
baṁtim̐gūsuṁḍi vibhunim̐ baṁgiṁchavalĕnā

(||||)
siggule lalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
kaggulenisavadulu gāsugunnāru
yĕggulega nannunelĕ nidanim̐ bānubumīm̐da
aggalaburadula nī valayim̐savalĕnā