Guttugalavaamdavamtaam gori nammi vumtimi

గుట్టుగలవాఁడవంటాఁ గోరి నమ్మి వుంటిమి
Language

(॥పల్లవి॥)
గుట్టుగలవాఁడవంటాఁ గోరి నమ్మి వుంటిమి
రట్టుసేతురా ఇంత ఇట్టె రమణులను

(॥గుట్టు॥)
మంతనాన నీమోవిపై మచ్చికఁ జేసినచేఁత
యెంత వెల్లవిరిసేసే విందరిలోన
చెంతల మనసుగరఁచినచెమటలెల్లాను
పంతానఁ గాలువలుగాఁ బారింతురా

(॥గుట్టు॥)
చలువై నరతిలోనిసాములరహస్యములు
వెలి నిట్టూర్పులుగాను వెళ్లవేతురా
తలఁపులొపలిమేలు తగిలినచొక్కులెల్లా
తెలిఁగన్నులయందునే దిష్టము చూపుదురా

(॥గుట్టు॥)
గక్కనఁ గూడినయట్టి కాఁగిటిలో సిగ్గులెల్ల
మిక్కిలి సెలవులను మెరఇంతురా
ఇక్కడ శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
తక్కక యాసోదానఁ దమకింతురా

(||pallavi||)
guṭṭugalavām̐ḍavaṁṭām̐ gori nammi vuṁṭimi
raṭṭusedurā iṁta iṭṭĕ ramaṇulanu

(||guṭṭu||)
maṁtanāna nīmovibai machchigam̐ jesinasem̐ta
yĕṁta vĕllavirisese viṁdarilona
sĕṁtala manasugaram̐sinasĕmaḍalĕllānu
paṁtānam̐ gāluvalugām̐ bāriṁturā

(||guṭṭu||)
saluvai naradilonisāmularahasyamulu
vĕli niṭṭūrbulugānu vĕḽlavedurā
talam̐pulŏbalimelu tagilinasŏkkulĕllā
tĕlim̐gannulayaṁdune diṣhṭamu sūbudurā

(||guṭṭu||)
gakkanam̐ gūḍinayaṭṭi kām̐giḍilo siggulĕlla
mikkili sĕlavulanu mĕra̮iṁturā
ikkaḍa śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
takkaga yāsodānam̐ damagiṁturā