గుట్టుగల రమణినిఁ గొనియాడుదు రిందరు
(॥పల్లవి॥)
గుట్టుగల రమణినిఁ గొనియాడుదు రిందరు
చుట్టరికము నెరపి జోడై యుండుటే మెలు
(॥గుట్టు॥)
వీసమంత పనికైనా వేగిరపడఁగవద్దు
వాసితోడ మెలఁగేటి వనితలతకు
ఆసతోడి మగవాఁడు ఆయములంటవచ్చితే
చేసూటికిఁ బెనఁగి సిగ్గువడుటే మేలు
(॥గుట్టు॥)
సరసములోన నేనా జంకించి కెలయవద్దు
దొరతనమెరిఁగిన తొయ్యలులకు
మరిగినవాఁడు తనమర్మము సోఁకనాడితే
సొరిది దప్పక చూచి చొక్కుటే మేలు
(॥గుట్టు॥)
కలలోనఁ గూడినాను గర్వము చూపవద్దు
వలవ నేరిచినట్టి వనితలకు
ఆ(అ?) లమేలు మంగవు నీ వతఁడు శ్రీవేంకటేశు
డెలమి నిన్నేలె నిఁక నియ్యకొనుటే మేలు
(||pallavi||)
guṭṭugala ramaṇinim̐ gŏniyāḍudu riṁdaru
suṭṭarigamu nĕrabi joḍai yuṁḍuḍe mĕlu
(||guṭṭu||)
vīsamaṁta panigainā vegirabaḍam̐gavaddu
vāsidoḍa mĕlam̐geḍi vanidaladagu
āsadoḍi magavām̐ḍu āyamulaṁṭavachchide
sesūḍigim̐ bĕnam̐gi sigguvaḍuḍe melu
(||guṭṭu||)
sarasamulona nenā jaṁkiṁchi kĕlayavaddu
dŏradanamĕrim̐gina tŏyyalulagu
mariginavām̐ḍu tanamarmamu som̐kanāḍide
sŏridi dappaga sūsi sŏkkuḍe melu
(||guṭṭu||)
kalalonam̐ gūḍinānu garvamu sūbavaddu
valava nerisinaṭṭi vanidalagu
ā(a?) lamelu maṁgavu nī vadam̐ḍu śhrīveṁkaḍeśhu
ḍĕlami ninnelĕ nim̐ka niyyagŏnuḍe melu