Guttudone vumdugaani kori nenemi sesinaa

గుట్టుతోనే వుందుగాని కోరి నేనేమి సేసినా
Language

(॥పల్లవి॥)
గుట్టుతోనే వుందుగాని కోరి నేనేమి సేసినా
పట్టపు రమణి నాతోఁ బదరేవు సుమ్మీ

(॥గుట్టు॥)
కోవిలలు చిగురాకు కొరుకునంటా భూమి-
నావలీవలివా రెల్లా నాడుకొందరు
కొవిల కూఁతలు నీకుత్తికలోనివి గదే
కావి నీ మోవిచిగురు గంటిచేసీఁ జుమ్మీ

(॥గుట్టు॥)
జక్కవలు భూమిలోన చంద్రోదయమైతే
తక్కక విరహాన బెదురు నందురు
జక్కవనీచన్ను లిట్టే సరి నీపయ్యద నవె
పెక్కుచంద్రవంకలైతే బెదరీఁ జుమ్మీ

(॥గుట్టు॥)
తుమ్మిదలు తామెరపైఁ దోలినానుఁ బోవందురు
దొమ్ముల శ్రీవేంకటాద్రి తుమ్మిద నేను
కొమ్మ నీతుమ్మిదవంటికురులు నీనెమ్మోముఁ
దుమ్మిమీఁదఁ జెదరి యంతటఁ గూఁడెఁజుమ్మీ

(||pallavi||)
guṭṭudone vuṁdugāni kori nenemi sesinā
paṭṭabu ramaṇi nādom̐ badarevu summī

(||guṭṭu||)
kovilalu sigurāgu kŏrugunaṁṭā bhūmi-
nāvalīvalivā rĕllā nāḍugŏṁdaru
kŏvila kūm̐talu nīguttigalonivi gade
kāvi nī movisiguru gaṁṭisesīm̐ jummī

(||guṭṭu||)
jakkavalu bhūmilona saṁdrodayamaide
takkaga virahāna bĕduru naṁduru
jakkavanīsannu liṭṭe sari nībayyada navĕ
pĕkkusaṁdravaṁkalaide bĕdarīm̐ jummī

(||guṭṭu||)
tummidalu tāmĕrabaim̐ dolinānum̐ bovaṁduru
dŏmmula śhrīveṁkaḍādri tummida nenu
kŏmma nīdummidavaṁṭigurulu nīnĕmmomum̐
dummimīm̐dam̐ jĕdari yaṁtaḍam̐ gūm̐ḍĕm̐jummī