Guttudodidaana nannu gorabela sesevoyi

గుట్టుతోడిదాన నన్ను గొరబేల సేసేవోయి
Language

(॥పల్లవి॥)
గుట్టుతోడిదాన నన్ను గొరబేల సేసేవోయి
గట్టిగా సేసవెట్టితేఁ గాదంటినా నిన్ను

(॥గుట్టు॥)
చన్నులంట వచ్చేవు జాణతనా లాడేవు
ఇన్నేసి చేఁతలకు నీకేమౌదునోయి
సన్న లూరకె సేసేవు సందులకు లాచేవు
కన్నవారెల్లా నిన్ను గామిడివాఁడనరా

(॥గుట్టు॥)
కప్పరము చల్లేవు కతలెల్లాఁ జెప్పేవు
అప్పడే నీకుఁ జుట్టమనైతినావోయి
కొప్ప జొరఁదీసేవు కొనగోరఁ జెనకేవు
వుప్పతించేవారు నిన్ను నుద్దండీఁడవనరా

(॥గుట్టు॥)
మోవితేనె లడియేవు మోము దప్పక చూచేవు
వావు లింత గలపఁగవలెనా వొయి
శ్రీవేంకటేశ నన్నుఁ జెలరేఁగి కూడితివి
యీవలావలివారు యిచ్చకుఁడ వనరా

(||pallavi||)
guṭṭudoḍidāna nannu gŏrabela sesevoyi
gaṭṭigā sesavĕṭṭidem̐ gādaṁṭinā ninnu

(||guṭṭu||)
sannulaṁṭa vachchevu jāṇadanā lāḍevu
innesi sem̐talagu nīgemaudunoyi
sanna lūragĕ sesevu saṁdulagu lāsevu
kannavārĕllā ninnu gāmiḍivām̐ḍanarā

(||guṭṭu||)
kapparamu sallevu kadalĕllām̐ jĕppevu
appaḍe nīgum̐ juṭṭamanaidināvoyi
kŏppa jŏram̐dīsevu kŏnagoram̐ jĕnagevu
vuppadiṁchevāru ninnu nuddaṁḍīm̐ḍavanarā

(||guṭṭu||)
movidenĕ laḍiyevu momu dappaga sūsevu
vāvu liṁta galabam̐gavalĕnā vŏyi
śhrīveṁkaḍeśha nannum̐ jĕlarem̐gi kūḍidivi
yīvalāvalivāru yichchagum̐ḍa vanarā