Guttudodanunna nannu gorabela seseene

గుట్టుతోడనున్న నన్ను గొరబేల సేసీనే
Language

(॥పల్లవి॥)
గుట్టుతోడనున్న నన్ను గొరబేల సేసీనే
దిట్టతనము నేఁ జూపితే గయ్యాళి యనఁడా

(॥గుట్టు॥)
సరసమాడినవాఁడు సంగడిఁ గూచుండుఁగాక
సొరిది నామనసెంత సోదించీనే
తెరవేసుకున్న వాఁడు తెచ్చి విడె మిచ్చుఁగాక
అరసి నన్నప్పటి నెం తడుగవచ్చీనే

(॥గుట్టు॥)
సెలవి నవ్వినవాఁడు సిగ్గులు దేరుచుఁగాక
అలసి తానింకా నేమి అండుకాచీనే
పిలిపించుకొన్నవాఁడు ప్రియమునఁ గూడుఁగాక
వొలిసి నన్నెందాఁక నొడఁబరచీనే

(॥గుట్టు॥)
చెనకినవాఁడిట్టె చేరి కాఁగిలించుఁగాక
చనవిచ్చి మీతో నేమి సన్న సేసినే
యెనసె శ్రీవేంకటేశుఁడింతలో నన్ను
తనిసి రతుల నెంత తప్పక చూచీనే

(||pallavi||)
guṭṭudoḍanunna nannu gŏrabela sesīne
diṭṭadanamu nem̐ jūbide gayyāḽi yanam̐ḍā

(||guṭṭu||)
sarasamāḍinavām̐ḍu saṁgaḍim̐ gūsuṁḍum̐gāga
sŏridi nāmanasĕṁta sodiṁchīne
tĕravesugunna vām̐ḍu tĕchchi viḍĕ michchum̐gāga
arasi nannappaḍi nĕṁ taḍugavachchīne

(||guṭṭu||)
sĕlavi navvinavām̐ḍu siggulu derusum̐gāga
alasi tāniṁkā nemi aṁḍugāsīne
pilibiṁchugŏnnavām̐ḍu priyamunam̐ gūḍum̐gāga
vŏlisi nannĕṁdām̐ka nŏḍam̐barasīne

(||guṭṭu||)
sĕnaginavām̐ḍiṭṭĕ seri kām̐giliṁchum̐gāga
sanavichchi mīdo nemi sanna sesine
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ḍiṁtalo nannu
tanisi radula nĕṁta tappaga sūsīne