Guttudoda numdede gunamu gaaga

గుట్టుతోడ నుండేదే గుణము గాక
Language

(॥పల్లవి॥)
గుట్టుతోడ నుండేదే గుణము గాక
ఱట్టడినై పతితోడ నిట్టె రాయడించేనా

(॥గుట్టు॥)
పెనఁగు లాడఁగ బోతే ప్రియములు గరిపడు
చెనకి చేవట్టితేను సిగ్గులు రేఁగు
మనసు లొరసితేను మర్మములు తడబఁడు
తనతో సాములు చేసి తప్పించుకోఁగలనా

(॥గుట్టు॥)
సారెకు నవ్వఁ జూచితే సరసము చండిపడు
చేరి చెక్కు నొక్కి తేను చెమటగారు
మేరతో నూరకుండితే మిక్కుటమౌఁ దమకము
యీరీతి నాతనితోడ నెదురాడఁగలనా

(॥గుట్టు॥)
పంతములు నెరపితే పాయనే పై తరవౌను
చింతించితే నాస లోలోఁ జిగిరించును
యింతలో శ్రీ వేంకటేశుఁ డితఁడె తా నన్నుఁ గూడె
వంతులఁ దా మన్నించఁగా వద్దనఁగఁ గలనా

(||pallavi||)
guṭṭudoḍa nuṁḍede guṇamu gāga
ṟaṭṭaḍinai padidoḍa niṭṭĕ rāyaḍiṁchenā

(||guṭṭu||)
pĕnam̐gu lāḍam̐ga bode priyamulu garibaḍu
sĕnagi sevaṭṭidenu siggulu rem̐gu
manasu lŏrasidenu marmamulu taḍabam̐ḍu
tanado sāmulu sesi tappiṁchugom̐galanā

(||guṭṭu||)
sārĕgu navvam̐ jūside sarasamu saṁḍibaḍu
seri sĕkku nŏkki tenu sĕmaḍagāru
merado nūraguṁḍide mikkuḍamaum̐ damagamu
yīrīdi nādanidoḍa nĕdurāḍam̐galanā

(||guṭṭu||)
paṁtamulu nĕrabide pāyane pai taravaunu
siṁtiṁchide nāsa lolom̐ jigiriṁchunu
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ tā nannum̐ gūḍĕ
vaṁtulam̐ dā manniṁcham̐gā vaddanam̐gam̐ galanā