గుట్టుతోడ నుండవయ్య కోరిన కోరికలాయ
(॥పల్లవి॥)
గుట్టుతోడ నుండవయ్య కోరిన కోరికలాయ
చిట్టక మింతయుఁ బాసె చింతలేల ఇఁకను
(॥గుట్టు॥)
మొగము చూచినందె మోహము నాకుఁ దెలిసి
నగితి నందుకుఁ దగ నానఁబెట్టి
జగడాలన్నియుఁ దేరె చనవు నా కిచ్చితివి
యెగసక్కెములు లేవు యిఁకనేల మాటలు
(॥గుట్టు॥)
వీడెమిచ్చినందే నీవేడుకెల్లాఁ గానవచ్చి
ఆడితిని సరసము లందుకుఁ దగ
ఆడ కోలుమాట చెల్లె సంగము లంటితి నిట్టె
సూడుఁబాడు గాదు వట్టిసొలపేల ఇందుకు
(॥గుట్టు॥)
దగ్గరినందే నీతలఁపెల్లాఁ గనుకొని
వొగ్గితి నీరతులకు వొద్దికతోడ
అగ్గపు శ్రీవేంకటేశ అలమేల్‌మంగను నేను
సిగ్గుదేరఁ గూడితివి చేత మొక్కే నిపుడు
(||pallavi||)
guṭṭudoḍa nuṁḍavayya korina korigalāya
siṭṭaga miṁtayum̐ bāsĕ siṁtalela im̐kanu
(||guṭṭu||)
mŏgamu sūsinaṁdĕ mohamu nāgum̐ dĕlisi
nagidi naṁdugum̐ daga nānam̐bĕṭṭi
jagaḍālanniyum̐ derĕ sanavu nā kichchidivi
yĕgasakkĕmulu levu yim̐kanela māḍalu
(||guṭṭu||)
vīḍĕmichchinaṁde nīveḍugĕllām̐ gānavachchi
āḍidini sarasamu laṁdugum̐ daga
āḍa kolumāḍa sĕllĕ saṁgamu laṁṭidi niṭṭĕ
sūḍum̐bāḍu gādu vaṭṭisŏlabela iṁdugu
(||guṭṭu||)
daggarinaṁde nīdalam̐pĕllām̐ ganugŏni
vŏggidi nīradulagu vŏddigadoḍa
aggabu śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
sigguderam̐ gūḍidivi seda mŏkke nibuḍu