గుట్టుతోడ నుండఁగానే గుణముగాక
(॥పల్లవి॥)
గుట్టుతోడ నుండఁగానే గుణముగాక
నెట్టుకొనఁబోతేను నీకుఁ జవులౌనా
(॥గుట్టు॥)
బలిమి నీతోఁ బెనఁగఁ బంతమా నాకింత
చెలఁగి నీచెప్పినట్టే సేసేఁగాక
వలపు దెలిపి నిన్ను వంచుకొనఁ జూచితేను
పలచనే కాని మరి పట్టుఁబస వున్నదా
(॥గుట్టు॥)
సారెకు తప్పు లెంచఁగ చలమా నిన్నింత
వోరెచుక యెట్టయినా నుండెఁ గాక
వూరకే వావులు చెప్పి వొడివట్టి తియ్యఁబొతే
దారదప్పి వుండుఁగాక తగులఁ జోటున్నదా
(॥గుట్టు॥)
కైకొనగఁ దమకించఁ గడమా నేఁడింత
నీకొలఁది మెలఁగేటినేరుపుగాక
యేక మైతివి శ్రీవేంకటేశుఁడ నాతో నీవు
వాకున మెచ్చుటే కాక వాసులు చూపేనా
(||pallavi||)
guṭṭudoḍa nuṁḍam̐gāne guṇamugāga
nĕṭṭugŏnam̐bodenu nīgum̐ javulaunā
(||guṭṭu||)
balimi nīdom̐ bĕnam̐gam̐ baṁtamā nāgiṁta
sĕlam̐gi nīsĕppinaṭṭe sesem̐gāga
valabu dĕlibi ninnu vaṁchugŏnam̐ jūsidenu
palasane kāni mari paṭṭum̐basa vunnadā
(||guṭṭu||)
sārĕgu tappu lĕṁcham̐ga salamā ninniṁta
vorĕsuga yĕṭṭayinā nuṁḍĕm̐ gāga
vūrage vāvulu sĕppi vŏḍivaṭṭi tiyyam̐bŏde
dāradappi vuṁḍum̐gāga tagulam̐ joḍunnadā
(||guṭṭu||)
kaigŏnagam̐ damagiṁcham̐ gaḍamā nem̐ḍiṁta
nīgŏlam̐di mĕlam̐geḍinerubugāga
yega maidivi śhrīveṁkaḍeśhum̐ḍa nādo nīvu
vāguna mĕchchuḍe kāga vāsulu sūbenā