గుట్టుతోడ మరిగించుకొని కూడుటే మేలు
(॥పల్లవి॥)
గుట్టుతోడ మరిగించుకొని కూడుటే మేలు
మట్టుమీరఁ బెనఁగితే మరి రట్టుపెట్టవా
(॥॥)
జలజాక్షిచన్నులతో సాములెంత సేసేవు
కొలఁదిమీరినయట్టి కొండలు గావా
నలువంక పిడికిట నడుమేమి గొలచేవు
చెలరేఁగేయటువంటిసింహము గాదా
(॥॥)
కొమ్మ చూపులనేల గుఱియై పొలసేవు
పమ్ముకొన్న పువ్వులబాణాలు గావా
ఇమ్ముల నొరశొరసి యేల పలికించేవు
కొమ్ముఁ మీఁది మదనుని గుఱ్ఱాలు గావా
(॥॥)
యీకె యల మేల్మంగ నెట్టు గాఁగిటఁ గూడితి
దీకొని చుట్టుకొనేటితీగే గాదా
యీకడ శ్రీవేంకటేశ యేల తురుమందితివి
చేకొన్న వలపుల చీఁకటే గాదా
(||pallavi||)
guṭṭudoḍa marigiṁchugŏni kūḍuḍe melu
maṭṭumīram̐ bĕnam̐gide mari raṭṭubĕṭṭavā
(||||)
jalajākṣhisannulado sāmulĕṁta sesevu
kŏlam̐dimīrinayaṭṭi kŏṁḍalu gāvā
naluvaṁka piḍigiḍa naḍumemi gŏlasevu
sĕlarem̐geyaḍuvaṁṭisiṁhamu gādā
(||||)
kŏmma sūbulanela guṟiyai pŏlasevu
pammugŏnna puvvulabāṇālu gāvā
immula nŏraśhŏrasi yela paligiṁchevu
kŏmmum̐ mīm̐di madanuni guṭrālu gāvā
(||||)
yīgĕ yala melmaṁga nĕṭṭu gām̐giḍam̐ gūḍidi
dīgŏni suṭṭugŏneḍidīge gādā
yīgaḍa śhrīveṁkaḍeśha yela turumaṁdidivi
segŏnna valabula sīm̐kaḍe gādā