Guttudo numdude melu komalulagu

గుట్టుతో నుండుటే మేలు కోమలులకు
Language

(॥పల్లవి॥)
గుట్టుతో నుండుటే మేలు కోమలులకు
చుట్టపు వరుస రతిఁ జొక్కించేనయ్యా

(॥గుట్టు॥)
సరుసఁ గూచుండఁగాను చన్ను లొరసునో యేమో
సిరులు మించఁ గొలువు సేసేనయ్యా
మరలి చూడఁగానే మర్మములు సోఁకునేమో
వరుసతోడుత దలవంచుక మొక్కేనయ్యా

(॥గుట్టు॥)
చేరి వీడె మియ్యఁగాను చెమట లంటునో యేమో
వూరకే వుయ్యాలమంచ మూఁచేనయ్యా
కోరి కొప్పు దువ్వఁగాను కొనగోరు దాఁకునేమో
నేరుపుతోఁ గుంచెవేసి నిలుచుండేనయ్యా

(॥గుట్టు॥)
చేముట్టి పెనఁగఁగఁగాను చిత్తము గరఁగునేమో
దోమటి దొడికి కాలు దొక్కేనయ్యా
యీమేర శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
నాములెక్క నిఁక నీతో నవ్వేనయ్యా

(||pallavi||)
guṭṭudo nuṁḍuḍe melu komalulagu
suṭṭabu varusa radim̐ jŏkkiṁchenayyā

(||guṭṭu||)
sarusam̐ gūsuṁḍam̐gānu sannu lŏrasuno yemo
sirulu miṁcham̐ gŏluvu sesenayyā
marali sūḍam̐gāne marmamulu som̐kunemo
varusadoḍuda dalavaṁchuga mŏkkenayyā

(||guṭṭu||)
seri vīḍĕ miyyam̐gānu sĕmaḍa laṁṭuno yemo
vūrage vuyyālamaṁcha mūm̐senayyā
kori kŏppu duvvam̐gānu kŏnagoru dām̐kunemo
nerubudom̐ guṁchĕvesi nilusuṁḍenayyā

(||guṭṭu||)
semuṭṭi pĕnam̐gam̐gam̐gānu sittamu garam̐gunemo
domaḍi dŏḍigi kālu dŏkkenayyā
yīmera śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
nāmulĕkka nim̐ka nīdo navvenayyā