Guttudo numdude melu gunavamturaaligi

గుట్టుతో నుండుటే మేలు గుణవంతురాలికి
Language

(॥పల్లవి॥)
గుట్టుతో నుండుటే మేలు గుణవంతురాలికి
ఇట్టె నీవు వలెనంటే ఇయ్యకొనఁదగును

(॥గుట్టు॥)
పక్కునఁ జూచినచూపు భావించి చూచినచూపు
మొక్కలాన నింతికుచములపై నాఁటె
ఇక్కునలంటి నిన్ను యెవ్వతె చెనకినాను
మిక్కిలి నీకూళతనమే మీదఁమిక్కిలౌను

(॥గుట్టు॥)
తగుల నాడినమాట తమితో నాడినమాట
వొగి నాపెకుఁబట్టినవుంకువాయను
జిగి నిన్నెవ్వతె ఇఁకఁ జెఱఁగువట్టితీసినా
వెగటై యెడ్డతనమే వెల్లావిరియౌను

(॥గుట్టు॥)
సంతసించినట్టినవ్వు సరసమాడిననవ్వు
ఇంతలో నాపెకాఁగిటి కిరవాయను
చెంతల శ్రీవేంకటేశ చేరి నన్నుఁ గూడితివి
వంతడిగితే నాపెకు జంతతనమౌను

(||pallavi||)
guṭṭudo nuṁḍuḍe melu guṇavaṁturāligi
iṭṭĕ nīvu valĕnaṁṭe iyyagŏnam̐dagunu

(||guṭṭu||)
pakkunam̐ jūsinasūbu bhāviṁchi sūsinasūbu
mŏkkalāna niṁtigusamulabai nām̐ṭĕ
ikkunalaṁṭi ninnu yĕvvadĕ sĕnaginānu
mikkili nīgūḽadaname mīdam̐mikkilaunu

(||guṭṭu||)
tagula nāḍinamāḍa tamido nāḍinamāḍa
vŏgi nābĕgum̐baṭṭinavuṁkuvāyanu
jigi ninnĕvvadĕ im̐kam̐ jĕṟam̐guvaṭṭidīsinā
vĕgaḍai yĕḍḍadaname vĕllāviriyaunu

(||guṭṭu||)
saṁtasiṁchinaṭṭinavvu sarasamāḍinanavvu
iṁtalo nābĕgām̐giḍi kiravāyanu
sĕṁtala śhrīveṁkaḍeśha seri nannum̐ gūḍidivi
vaṁtaḍigide nābĕgu jaṁtadanamaunu