Guttudo numdaneevayya gunavamtumdavu neevu

గుట్టుతో నుండనీవయ్య గుణవంతుఁడవు నీవు
Language

(॥పల్లవి॥)
గుట్టుతో నుండనీవయ్య గుణవంతుఁడవు నీవు
పట్టి పెనఁగఁబోతే పండు గాయయ్యీనా

(॥గుట్టు॥)
మలసి సారెకు నిన్ను మనసు సోదించనేల
యెలమి నందులోఁ దప్పులెంచనేల
బలిమి నుక్కు కాచితే పై పై రాపొడేకాక
కలిగీనా అందులోనే కనకపురజము

(॥గుట్టు ॥)
పంతమాడి నీతోడ బలిమిఁ బెనఁగనేల
హోంతకారివైననిన్ను నోడించనేల
యెంతమాను రాచినాను ఎదుటఁ జూపరేకాక
బంతినే గందమువలెఁ బరిమళించీనా

(॥గుట్టు॥)
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కోపగించనేల
మూవంకల నంతలోనె మొక్కనేల
యీవేళ నన్నుఁ గూడితి వే నలమేల్మంగనని
నీవు నీవేకాక మరి నేనయ్యేవా

(||pallavi||)
guṭṭudo nuṁḍanīvayya guṇavaṁtum̐ḍavu nīvu
paṭṭi pĕnam̐gam̐bode paṁḍu gāyayyīnā

(||guṭṭu||)
malasi sārĕgu ninnu manasu sodiṁchanela
yĕlami naṁdulom̐ dappulĕṁchanela
balimi nukku kāside pai pai rābŏḍegāga
kaligīnā aṁdulone kanagaburajamu

(||guṭṭu ||)
paṁtamāḍi nīdoḍa balimim̐ bĕnam̐ganela
hoṁtagārivainaninnu noḍiṁchanela
yĕṁtamānu rāsinānu ĕduḍam̐ jūbaregāga
baṁtine gaṁdamuvalĕm̐ barimaḽiṁchīnā

(||guṭṭu||)
śhrīveṁkaḍeśha ninnum̐ jeri kobagiṁchanela
mūvaṁkala naṁtalonĕ mŏkkanela
yīveḽa nannum̐ gūḍidi ve nalamelmaṁganani
nīvu nīvegāga mari nenayyevā