గుట్టు సేసి దాఁచరాదు గురిసేసి చూపరాదు
(॥పల్లవి॥)
గుట్టు సేసి దాఁచరాదు గురిసేసి చూపరాదు
ఇట్టిది నా యాందోళము యింతి యేమి సేతునే
(॥గుట్టు॥)
మచ్చిక కొండవంటిది మనసు మెయిలువంటిది
హెచ్చీ నిదే తుమకము లేమి సేతునే
ముచ్చట చెప్పీనంటే ముంచుకొనీ సిగ్గులు
పచ్చిదేరీ నుడిగితే భావ మేమిసేతునే
(॥గుట్టు॥)
చెలిమి తీగెవంటిది చింత వనమువంటిది
యెలఇంచీఁ గోరికలు యేమిసేతునే
తలఁచుకొంటే సెలవిఁ దతిగొనీ నవ్వులు
చెలరేఁగీ వేడుకలు చెలి యేమిసేతునే
(॥గుట్టు॥)
పాయము పువ్వువంటిది భావము పండువంటిది
యేయెడ చూచినా దామే యేమిసేతునే
పాయక శ్రీవేంకటాద్రిపతి నన్ను నేలినాఁడు
పాయమెల్లాఁ బులకించీ కాంత యేమిసేతునే
(||pallavi||)
guṭṭu sesi dām̐sarādu gurisesi sūbarādu
iṭṭidi nā yāṁdoḽamu yiṁti yemi sedune
(||guṭṭu||)
machchiga kŏṁḍavaṁṭidi manasu mĕyiluvaṁṭidi
hĕchchī nide tumagamu lemi sedune
muchchaḍa sĕppīnaṁṭe muṁchugŏnī siggulu
pachchiderī nuḍigide bhāva memisedune
(||guṭṭu||)
sĕlimi tīgĕvaṁṭidi siṁta vanamuvaṁṭidi
yĕla̮iṁchīm̐ gorigalu yemisedune
talam̐sugŏṁṭe sĕlavim̐ dadigŏnī navvulu
sĕlarem̐gī veḍugalu sĕli yemisedune
(||guṭṭu||)
pāyamu puvvuvaṁṭidi bhāvamu paṁḍuvaṁṭidi
yeyĕḍa sūsinā dāme yemisedune
pāyaga śhrīveṁkaḍādribadi nannu nelinām̐ḍu
pāyamĕllām̐ bulagiṁchī kāṁta yemisedune